పుట:Jyothishya shastramu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక చిక్కు సమస్య ఉండడము వలన ఈ విషయములో సత్యము చెప్పుటకు వీలు పడడములేదు. ఆ చిక్కు సమస్యను తర్వాత చెప్పగలను. ఇప్పుడు ద్వాదశ స్థానమును గురించి చెప్పుకొంటే ఇది పాపపుణ్యముల మిశ్రమ స్థానము. మిశ్రమము అంటే కలిసిపోయాయని కాదు, రెండూ ఒకే స్థానములో ఉన్నాయని అర్థము. అందువలన ఇక్కడ ఒక పుణ్య గ్రహమైన శుభగ్రహముంటే ఇక్కడ ఏదైనా దుర్వినియోగముకాదు. డబ్బుగానీ, ధాన్యము గానీ, నీరుగానీ ఖర్చు చేయు ఏదైనా దుర్వినియోగముకాదు. చెడు ఉపయోగములకు కాకుండా మంచిగా ఉపయోగపడును. కేతుగ్రహముంటే (శుభగ్రహముగా) ఆధ్యాత్మిక చింతనకలుగజేసి హిందువును భగవద్గీతను, ముస్లీమ్‌ను ఖుర్‌ఆన్‌ను, క్రైస్తవుడైతే బైబిల్‌ను చదువునట్లు చేయును. గురువు గ్రహమున్న జ్ఞాన విషయములని పేరుపెట్టిన దానిని చదువును. మిగతా నాలుగు గ్రహములలో ఏదొక్కటియున్నా సద్గ్రంథములను చదువునట్లు చేయును. సద్గ్రంథ పఠనముచే దైవభక్తి చేకూరి ముక్తికొరకు ప్రయత్నించును. ప్రయత్నించకపోయినా ముక్తి ఒకటున్నదని తెలిసిపోవును. తర్వాత శుభ గ్రహము ఏదున్నా పాపభీతిని కల్గించి, నరకలోకమును తప్పించి స్వర్గ లోక ప్రాప్తి కల్గించునని తెలియుచున్నది. అంతేకాక అంతవరకున్న మనిషిలోని పశుత్వమును మాన్పించి మానవత్వమును గల్పించును. అంత వరకు చేయుచున్న జంతువధను మాన్పించి అక్కడ ఖర్చయ్యే డబ్బును ఇతరులకు ఉపయోగపెట్టి, దానిద్వారా తర్వాత మంచి జన్మ పొందుటకు అవకాశము కల్గించును. మరణ సమయములో ఎక్కువ కష్టములు లేకుండా నిశ్చింతగా ఉండునట్లు చేయును. జాతకుడు మరణించినప్పుడు ప్రజలు ఎక్కువ మంది వచ్చి అతనిని గురించి చెప్పుకొనునట్లు చేయును. అతడు చనిపోయిన చోట అన్ని అనుకూలతలు ఉండి శవయాత్ర బాగా జరుగు