పుట:Jyothishya shastramu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదాయము లభించును. జ్ఞానమార్గమున జీవితము గడుపవలెనను ఆలోచన వచ్చును. ఒకవేళ ఇక్కడొక పాపగ్రహముండిన పైన చెప్పిన విషయము లన్నిటికి వ్యతిరేఖముగా చేయుటకు ప్రయత్నించును. ఉదాహరణకు శుక్రుడు శుభగ్రహమై తొమ్మిదవ స్థానములోయుంటే, శుక్రుడు ఐశ్వర్యమునకు (డబ్బుకు) అధిపతియగుట వలన జాతకునకు డబ్బు సమృద్ధిగా ఉండును. ఒకవేళ శుక్రుడు అశుభగ్రహమై తొమ్మిదవ స్థానములో యుంటే నూరు రూపాయలు కూడా లేని స్థితి ఏర్పడును. బీదవానిగా బ్రతుక వలసివచ్చును. మూడవస్థానము ఎదురుగాయున్నందున అక్కడి పాపముతో ఇక్కడ నిర్భాగ్యుణ్ణి చేయును. అలాగే గురువు ఈ స్థానమునకు శుభుడైయున్న గురువు బంగారుకధిపతి అయినందున బంగారమును ఎక్కువ కలుగజేయును. అదే గురువు అశుభుడైయుంటే తన (గురువు) ఆధీనములో నున్న బంగారును ఏమాత్రము లేకుండ చేయును. ఈ విధముగా ఒక స్థానములోని శుభాశుభములను స్థానమునుబట్టియు, గ్రహమునుబట్టియు తెలియవచ్చును.

దశమ స్థానము - జీవన స్థానము

అర్ధాంగి భాగములో కేంద్రమైన దశమ స్థానమున పాపపుణ్యములు రెండూ గలవు. ఈ స్థానమున పుణ్యమును అందించు శుభగ్రహము ఉన్నట్లయితే, జీవనోపాదులైన ఉన్నత వృత్తిగానీ, పెద్ద ఉదోగ్యముగానీ, మంచి వ్యాపారము గానీ కల్గునట్లు శుభగ్రహము చేయును. రాజకీయమే వృత్తిగాయున్న వానికి పాలనాశక్తినీ, దానికి కావలసిన యుక్తినీ జాతకునకు శుభగ్రహము ఇచ్చును. యుక్తితో పనిగానీ, వ్యాపారముగానీ, రాజకీయము గానీ చేయువానికి కీర్తి గౌరవప్రతిష్ఠలు కల్గునట్లు చేయును. చేయు వృత్తిలో