పుట:Jyothishya shastramu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భార్య సౌఖ్యము లేకుండ చేయును. యౌవ్వన కాలమంతా వ్యర్థమగును. వివాహము కావడమే కష్టమగును. ఒకవేళ వివాహమైనా అది కొంత కాలమునకే చెడిపోయి భార్య విడిపోవును. ఉన్నంత కాలము భార్య భర్తలకు ఏమాత్రము పొసగదు. జీవితములో ముఖ్యమైనది భార్య అయితే ఆ భార్య వలన సుఖము లేకుండ ఎప్పుడూ కష్టమే ఉండుట వలన, మరికొన్ని కారణముల వలన పూర్తి విసుగుచెంది మనోశాంతి లేకుండ పోవును. దానికి తోడు ఆ స్థానములో ఎనిమిదవ స్థానాదిపతియుండినా, ఎనిమిదవ స్థానములో పాపగ్రహముండినా అటువంటి వాడు భార్యవలన మనోకలత చెంది చివరకు ఆత్మహత్య చేసుకొనును.

కళత్రము అనగా పూర్తి భార్య సంబంధమైన దానివలన సప్తమ స్థానములో శుభగ్రహముండినా లేక శుభగ్రహము తన చేతులతో తాకినా కళత్రము నుండి లభించు అన్ని రకముల కష్టములు లేకుండ పోవును. ఆ స్థానములో పుణ్యము లేకున్నా శుభగ్రహము ఉండుట వలన శుభ గ్రహము ఎదురుగా ఒకటవ స్థానముననున్న పుణ్యములను గ్రహించి, ఆ పుణ్యము ద్వారా శరీర సుఖమును అందివ్వవలసిన కర్తవ్యము తనకున్నది. కావున భార్యనుండి శరీర సుఖము అందించును. అప్పుడు ఒకటవ స్థానములోని శరీర సౌష్టవము, శరీరము అందము ద్వారా భార్యను ఆకర్షితురాలిగా చేసి సుఖమునందించును. అట్లే మిగతా విషయములైన భార్య ద్వారా ధనము కలుగునట్లు చేయును. వివాహము ఉన్నట్లుండి జరుగునట్లు చేయును. స్త్రీసాంగత్యము, సుగంధములు, మధుర పానీ యములు, మధుర ఫలహారములు, పుష్పములు, తాంబూలము అనుకోకుండ లభ్యమగును. ఇతర స్త్రీలను ఆకర్షించుట వారివలన సుఖము పొందునది ఒక స్థానమున ఉండుట వలన అతనికి భార్యయే ఇతర స్త్రీ క్రింద జమకట్టి