పుట:Jyothishya shastramu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలహీనమైన దేహమూ, అంగలోపమున్న దేహమునూ, అనారోగ్యములకు అనువుగాయున్న దేహమునూ, అంగసౌష్టవము లేని దేహమునూ లభించు నట్లు చేయును. శుభగ్రహముండిన మంచి బలమైన శరీరము, మంచి అందమైన శరీరము, మంచి కొలతలుగల్గిన అంగసౌష్టవమున్న శరీరమును ఆ జాతకుడు కల్గియుండును. మొదటి స్థానమైన శరీర స్థానమున ఏ గ్రహమూ లేకున్నా, ఏ గ్రహమూ తన హస్తములతో తాకకున్నా అటువంటి వానికి మధ్యతరగతి ఆరోగ్యము, అందము, అంగసౌష్టవముగల శరీరముండును. ఈ విధముగా ఒక వ్యక్తికి (జాతకునికి) శరీరము ఎట్లుండునని జ్యోతిష్యము ద్వారా అతని కర్మచక్రములోని ప్రథమ స్థానమును చూచి చెప్పవచ్చును.

ద్వితీయ స్థానము (ధనము)

రెండవ స్థానము ధనస్థానమని పేరుగాంచియున్నా ఆ స్థానములో ఒక ధన విషయమే కాకుండా, మిగతా విషయముల కర్మలు కూడా ఉండును. మిగత ఉన్నవాటిలో వాక్కు ముఖ్యమైనది. అంతేకాక కుటుంబము, నేత్రము, కర్ణము (చెవి) ముఖ వర్చస్సు, మరణము మొదలగునవి ఉండును. అవియేకాక వాక్‌చతురత, సత్యవచనములు పలుకుట, మాటకు అందరు సమ్మతించుట, మాట్లాడబడిన మాటలు అందరినీ ఆకర్షించునట్లు ఉండును. రెండవ స్థానమున శుభగ్రహమున్నా (మిత్ర గ్రహమున్నా) లేక వేరే స్థానములోవుండి తన హస్తము చేత అక్కడినుండి తాకినా, ముఖవర్చస్సులో ప్రత్యేకత కల్గియుండును. కన్నులు సోయగముగా సొంపుగా ఆకర్షణగా ఉండును. ఆయుర్‌ బలముండును. మంచి కుటుంబముతో ఉండడమేకాక ఆ కుటుంబము దైవభక్తికలదై