పుట:Jyothishya shastramu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురించి చూచుటకు ముందు అడిగిన ప్రశ్నలో ఏ గ్రహమును చూచామో, ఏ స్థానమును చూచామో వ్రాశాము. అందువలన జ్యోతిష్యమునకు ప్రశ్నకు సంబంధించిన స్థానము, గ్రహము ముఖ్యమన్నాము.

ఇంతకుముందు ఏ గ్రహము ఆధీనములో ఏ వస్తువులు, ఏ విషయములు ఉన్నాయో వ్రాసుకొన్నాము. పన్నెండు గ్రహముల ఆధీనము లోని అన్ని విషయములను తెలుసుకొన్నాము. అయితే ఏ రాశిలో ఏ కర్మ ఉన్నదని గతములో చెప్పుచూ పన్నెండు రాశులను గుర్తించి, వాటిలో అంగీ అర్ధాంగి అని రెండు భాగములను చూపి, అందులో కొన్ని విషయములను మాత్రము పొందుపరచి చూపాము. అయితే ఎన్నో విషయములను అక్కడ చూపలేదు. అందువలన పై ప్రశ్నకు జవాబును చెప్పుచూ పదవ స్థానమును చూడవలెనని చెప్పాము. పదవ స్థానములో జీవన విధానము ఉన్నదని మొదట చెప్పలేదు. అప్పుడు చెప్పని విషయములను పూర్తిగా ఇప్పుడు చెప్పుచున్నాము జాగ్రత్తగా చూడండి.

ప్రథమ స్థానము (తనువు)

శరీరము, ఆత్మ, రూపము, స్వభావము, అంగ సౌష్టవమును గురించిన మొదలగు విషయములు ప్రథమ రాశిలో ఉండును. కర్మచక్రము లోని మొదటి స్థానములో శరీరమునకు సంబంధించిన పుణ్యము ఉండును. ఇది పుణ్య స్థానమే అయినా శత్రు గ్రహము (పాపమును పాలించు గ్రహము) ఆ స్థానములోనికి తన కిరణములను ప్రసరింపజేసితే అక్కడున్న పుణ్యమును ఆ కిరణములు గ్రహించక తమకు పట్టనట్లుండుట వలన ఆ జాతకుడు పుణ్యము ప్రకారము మంచి శరీరము పొందలేక పోవును. అక్కడకు కిరణముల ద్వారా చూచునది పాపగ్రహమైనప్పుడు తన ప్రభావము చేత