పుట:Jyothishya shastramu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మచక్రములోని పన్నెండు రాశులలో కర్మయుండును. అలాగే కాలచక్రములోని మేషము మొదలగు పేర్లుగల లగ్నములలో గ్రహములు ఉండునని ముందే చెప్పాము. అందువలన జ్యోతిష్యమును చెప్పు ఏ జ్యోతిష్యుడైనా కుండలిలోని ప్రశ్నకు సంబంధించిన స్థానమునూ అలాగే ఆ ప్రశ్నకు సంబంధించిన గ్రహమును ముఖ్యముగా చూచుకొని ఆ రెండిటి ఆధారముతోనే జవాబును చెప్పాలి. ఇప్పటి కాలములో పుట్టిన తేదీ, పుట్టిన సమయము ఉంటే 80 సంవత్సరముల తర్వాత అయినా కంప్యూటర్‌ ద్వారా జాతకలగ్నమును వ్రాసుకోవచ్చును.

43. రాశి - గ్రహము

ఇంతకుముందే కర్మచక్రములోని భాగములను రాశులంటామని చెప్పుకొన్నాము. అలాగే కాలచక్రములోని భాగములను లగ్నములంటాము. కాలచక్రములోని లగ్నములలో, గ్రహములు తిరుగుచుండునని చెప్పాము. ఇంతకుముందు ఒక వ్యక్తి ఏమి వ్యాపారము చేయునని ప్రశ్నవచ్చినప్పుడు, జ్యోతిష్యము ప్రకారము అతని భవిష్యత్తులోని జీవన విధానమును గురించి చెప్పుచూ అతడు వ్యాపారము చేయడు, ఉద్యోగమును చేస్తాడని చెప్పాము. అంతేకాక కోర్టులో జడ్జిగాగానీ, జస్టీస్‌గాగానీ ఉద్యోగము చేయవచ్చునని చెప్పడము జరిగినది. అలా చెప్పుటకు కారణము ఏమైనది అను విషయమును వివరముగా చెప్పాము. అంతేగాక ఏ జాతకుని ప్రశ్నకైనా జవాబు చెప్పుటకు ఏ జ్యోతిష్యుడైనా ముఖ్యముగా ప్రశ్నకు సంబంధించిన స్థానమునూ, అలాగే ప్రశ్నకు సంబంధించిన గ్రహమునూ చూడవలెనని చెప్పాము. లగ్న గ్రహమునుబట్టియు, కర్మస్థానమునుబట్టియు జ్యోతిష్యము ప్రకారము భవిష్యత్తును చెప్పవచ్చును. వృత్తి లేక ఉద్యోగము, వ్యాపారమును