పుట:Jyothishya shastramu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంబంధమున్న వాడు ప్రభుత్వ ధనముతో జీవించుటయేగాక శాసించు అధికారమును కల్గియుండును. చంద్రుడు నాల్గవ స్థానమునుండి పదవ దైన సింహమును తాకుట వలన ముద్రవేసి శాసించు అధికారమును పొందునట్లు చేసి జడ్జిగాగానీ, జస్టీస్‌గాగానీ నిలబెట్టును. అడిగిన ప్రశ్నను బట్టి దానికి సంబంధించిన స్థానమునూ, అలాగే లగ్నాధిపతిని ఆధారము చేసుకొని జవాబును చెప్పవచ్చును.

అతడు (జాతకుడు) పుట్టినప్పుడు తేదీని పుట్టిన సమయమును అతని తల్లితండ్రులు గుర్తించుకొని, తమ కొడుకు 25 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత ఎలా జీవిస్తాడోయని, జ్యోతిష్యున్ని అడుగుట వలన, జ్యోతిష్యుడు జాతకుడు పుట్టిన తేదీని, పుట్టిన సమయమును బట్టి ఆ సంవత్సర పంచాంగమును చూచి, పుట్టిన సమయములో గ్రహములు ఎక్కడున్నాయో తెలుసుకొని, ఆ దిన జన్మ లగ్నమును తెలుసుకోగలిగాడు. జన్మ లగ్నము తెలిసిన తర్వాత జాతకునికి అనుకూలమైన గ్రహములు ఏవో, అనుకూలము కాని గ్రహములు ఏవో తెలుసుకొని, తర్వాత అడిగిన ప్రశ్నకు సంబంధించిన లగ్నమును లగ్నాధిపతిని తెలిసి అప్పటికి జవాబును చెప్పడమైనది. జన్మ లగ్నమునుబట్టి గుర్తించిన ఒకటవ నంబరునుండి పన్నెండు నంబర్ల లగ్నములను పన్నెండు కర్మచక్ర రాశులుగా లెక్కించు కోవలెను. తర్వాతే మేషము మొదలు మీనము వరకు కాలచక్రములో గ్రహములున్నవని తెలియవలెను. పన్నెండు భాగముల స్థలములను (కుండలిని) కర్మ చక్ర రాశులుగా సంఖ్యలతో గ్రహములున్నవి. మేషాది మీనములను పేర్లుగలవి లగ్నములని తెలియవలెను. మొదట ఎవరికైన కొంత తికమకగాయున్నా బాగా యోచించి అర్థము చేసుకొంటే సులభముగా అర్థము కాగలదు.