పుట:Jyothishya shastramu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలియజేయునదే భూగ్రహమని తెలియవలెను. ఇప్పుడు ఏ గ్రహము వలన ఏ రోగము వచ్చునో తెలుసుకొందాము.

1. సూర్యుడు - అతిసారము, జ్వరము, వేడి అగుట, శ్వాససంబంధ రోగములు కల్గును.

2. చంద్రుడు - పాండురోగము (రక్తలేమి) కామెర్లు, జల రోగములు, నీరసము, నాసికారంధ్రములలో బాధ, స్త్రీ సంబంధ వ్యాధులు, మూత్రము సరిగా రాకుండుట.

3. కుజుడు - వరిబీజాలు (బీజము వాపు), కత్తిపోట్లు లేక కత్తి గాయములు, మశూచి, కఫము, వ్రణములు (పుండ్లు), గ్రంథుల రోగము (థైరాయిడ్‌ మొదలగునవి).

4. బుధుడు- ఉదరబాధలు, కుష్టు రోగము, వేడి, నొప్పులు, మర్మావయవముల బాధలు, దయ్యముల వలనగానీ, క్షుద్ర దేవతల వలనగానీ వచ్చు శరీర రోగములు లేక బాధలు.

5) గురువు - కన్పించని మర్మస్థాన రోగములు, శుక్ల నష్ట వ్యాధులు, కాళ్ళ మంటలు.

6) శుక్రుడు - మధుమేహము, స్త్రీల నుండి సక్రమించు సుఖవ్యాధులు, పర యువతుల కొరకు కామ వికారము, మూత్ర రోగములు, అతి మూత్రము, ఎచ్‌.ఐ.వి. రోగము, గనేరియా, సిఫిలిస్‌ రోగములు.

7) శని - మూలవ్యాధి, కీళ్ళ వ్యాధులు

8) రాహువు - మూర్చ, అపస్మారము, మశూచి, ఉష్ణరోగములు

9) కేతువు - దురద, రహస్య వ్యాధులు, క్యాన్సర్‌