పుట:Jyothishya shastramu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోవచ్చును. అందువలన జ్యోతిష్యములో ఇటు గ్రహములు, అటు కర్మ ఆచరణ (ఆచారము) అను రెండు భాగములు ఉన్నవి. రెండిటిని కలిపి గ్రహచారము (గ్రహచారణ) అంటున్నాము. ఎవని గ్రహచారము ఎట్లుందో, వాని కాల, కర్మచక్రములను బట్టి తెలియును. కాలచక్రము పండ్రెండు భాగములు విభజింపబడి పండ్రెండు పేర్లుండును. వాటిని క్రింద 1వ చిత్రపటరూపములో చూస్తాము.

కాలచక్రము - 1వపటము

1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య 7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము.

ఈ పండ్రెండు కాలచక్రభాగములలోనున్న గ్రహములు నిర్ణీతమైన వేగముతో గతి తప్పక ప్రయాణించుచూ తమ కిరణములను కర్మచక్రము మీద ప్రసరింపజేయుచుండును. ఇపుడు చక్రముల వివరము పూర్తిగా తెలుసుకొందాము. ప్రతి మనిషి తలలో బ్రహ్మ,కాల, కర్మ,గుణచక్రములను నాలుగుచక్రముల సముదాయము గలదు. ఈ నాలుగు చక్రముల