పుట:Jyothishya shastramu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విభేదిస్తారని తెలిసి మీరు ముందు చదివినవన్నీ సత్యము కాదు అని తెలుపుటకు మాకంటే ముందు చెప్పిన వారి యోగములు 27, కరణములు 11 ఎంత సత్యమో చూడండని చెప్పాము. ఎటుచూచినా 27 యోగములు, 11 కరణములు అర్థము కాకుండపోవుచున్నవి. మేము చెప్పిన యోగములు, కరణములు సులభముగా అర్థము కాగలవు. ఇప్పుడు అందరికీ క్రొత్తగాయున్న పన్నెండు గ్రహములనుమాటనూ, అట్లే మార్పు చెందిన దశల సంవత్సరములనూ సత్యమని ప్రతి ఒక్కరూ తెలియవలెను. పన్నెండు గ్రహములను, పన్నెండు దశలను వదిలి జ్యోతిష్యమును చూచుట వలన ఎక్కువ శాతము జ్యోతిష్యము అశాస్త్రముగా కనిపించుచున్నది. అందువలన కొందరు పనిగట్టుకొని జ్యోతిష్యము మూఢనమ్మకమనీ, జ్యోతిష్యము శాస్త్రముకాదని చెప్పుచూ, దానిని సంఘ సేవగా చెప్పు కొంటున్నారు.

సృష్ఠ్యాదినుండి ఆరుశాస్త్రములు తయారైనవి. దేవుడే వాటిని మనుషులకు అందించాడని చెప్పవచ్చును. ప్రపంచములో ప్రతి విషయమును తేల్చి చూపునది శాస్త్రము. శాస్త్రసమ్మతమైనప్పుడే అది సత్యమైనదని, శాస్త్రబద్దముకానిది ఏదైనా అది అసత్యమని చెప్పుటకు దేవుడు శాస్త్రములను సృష్ఠించాడు. ప్రపంచములో షట్‌ శాస్త్రములుగాయున్న వాటిలో జ్యోతిష్యము శాస్త్రము కాదంటే ఆరు శాస్త్రములలో ఒకటైన జ్యోతిష్యము లేకుండపోయి చివరకు ఐదు శాస్త్రములు మిగిలిపోవును. ఒక శాస్త్రము లోపించితే శాస్త్రముల సమతుల్యత తగ్గిపోయి చివరకు ఏ శాస్త్రమూ లేకుండ పోవుటకు అవకాశము ఏర్పడగలదు. అప్పుడు ఏ విషయమునకూ ప్రపంచములో హద్దూ పద్దూ లేకుండాపోవును. దానితో నాస్తికత్వము ఏర్పడి చివరకు దేవుడే లేడను వాదము బయటికి వచ్చి బలపడగలదు. అటువంటి పరిస్థితి