పుట:Jyothishya shastramu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచాంగములో తిథి, వార, నక్షత్ర అను మూడు అంగములను ఒకవైపు, యోగ కరణములను ఒకవైపు రెండు భాగములుగా విభజించు కోవచ్చును. ఎందుకనగా తిథి, వార, నక్షత్రములైన మూడు ద్వారా యోగ కరణములను తెలియవచ్చును. అందువలన యోగ కరణములకు తిథి, వార, నక్షత్రములు ముఖ్యమని చెప్పవచ్చును. తిథి, వార, నక్షత్రములను మూడులో ఎవరికీ ఎటువంటి అనుమానములూ లేవు, అవి అందరికీ తెలిసినవే. అయితే రెండు అయిన యోగ, కరణముల విషయములో కొందరు ఎవరికీ పొంతన సరిపోకుండ 27 యోగములు, 11 కరణములని చెప్పడము మాకు పూర్తి అర్థముకాని విషయము. వారు చెప్పిన యోగ, కరణములు పంచాంగములోగానీ, జ్యోతిష్యములోగానీ వాటి ఉపయోగ మేమిటో వాటిని చెప్పినవారే చెప్పవలసియుంటుంది.

ఇంతకుముందు గ్రహములను గురించి చెప్పుకొన్నాము. అందరూ చెప్పుకొనిన నవగ్రహములను చెప్పక, ప్రత్యేక ద్వాదశ గ్రహములను చెప్పుకొన్నాము. మూడు గ్రహముల తేడా ఎందుకు వచ్చిందో తొమ్మిది గ్రహములను చెప్పినవారినే అడుగవలెను. 27 యోగములను, 11 కరణములను ఎలాగైతే కాదన్నామో, అలాగే నవగ్రహములను కాదని ద్వాదశ గ్రహములు సత్యమని చెప్పాము. అంతేకాక మిగతా మూడు గ్రహములకు దశాకాలములు ఎట్లున్నాయో చెప్పుకొన్నాము. దశాకాలపరిమితివద్ద శని వర్గమునకు, గురువర్గమునకు సమానముగా 60 సంవత్సరములున్నాయని చెప్పాము. దశల కాలములను సరిచేసి చెప్పడమే కాకుండా గ్రహముల ఆధీనములో గల వాటిని చెప్పుచూ అందరూ వదలివేసిన మూడు గ్రహములైన భూమి, మిత్ర, చిత్ర గ్రహముల స్వంత ఆధీనములో గలవేవో చెప్పాము. మేము చెప్పిన పన్నెండు గ్రహముల విషయములో చాలామంది