పుట:Jyothishya shastramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేటాయించడమును ‘జాఫతకము’ అంటున్నాము. కేటాయించిన కర్మ పేరు ప్రారబ్ధము అయితే, కేటాయించిన పద్ధతిని జాఫతకము అంటున్నాము. ఒకని జీవితమునకు పుట్టుకలోని జాఫతకమును చూస్తే, ఆ జన్మకు సంబంధించిన ప్రారబ్ధము ఫలానా అని తెలియును. ప్రారబ్ధము తెలిస్తే వాని జీవితములోని కష్టసుఖములు తెలియును. ఈ పద్ధతి ప్రకారము జాతకము ద్వార ప్రారబ్ధమును తెలియడమునే ‘జ్యోతిష్యము’ అంటున్నాము.

6. కాల, కర్మ చక్రములు

ఒక జీవుడు తన జీవితములో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మను, ఒక ఫతకము ప్రకారము పుట్టినపుడే నిర్ణయించి ఉండడమును, జాఫతకము అన్నాము కదా! ఆ జాఫతకము పండ్రెండు విధములుగా విభజింపబడి ఉండును. విభజింపబడిన జాఫతకములోని ప్రారబ్ధము, పండ్రెండు భాగములుగానున్న కర్మచక్రములో ఉండును. ఎవని కర్మచక్రము వాని తలలో ఉండును. తల మధ్యభాగములో ఫాలభాగమున (నుదుటిభాగమున) గల నాలుగు చక్రముల సముదాయములో, క్రిందినుండి రెండవ చక్రము కర్మచక్రమై ఉన్నది. కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను జీవితకాలములో మనిషి చేత అనుభవింప చేయునవి గ్రహములు. గ్రహములు కూడ కర్మ చక్రమును ఆనుకొని, పైనగల కాలచక్రములో గలవు. పుట్టిన సమయములో గల జాఫతకము ద్వారా మనిషి జీవిత ప్రారబ్ధమును తెలుసుకోవచ్చని చెప్పుకొన్నాము కదా! జాఫతకములో కర్మ ప్రత్యక్షముగా కనిపించదు. జాఫతకములో ప్రత్యక్షముగ గ్రహములు కనిపించును. కాలచక్రములోని గ్రహములను చూచి, వాటి ద్వార అవి పాలించు ప్రారబ్ధమును తెలుసు