పుట:Jyothishya shastramu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుధుడు శత్రుగ్రహమైతే భూతవైద్యమును చేసినా దానివలన దయ్యములు పోవు. అంతేకాక దయ్యములే అతనిని ఇబ్బంది పెట్టును. కొంతమందికి నాల్గవ స్థానమును బుధుడు చూచిన అతనికి మిత్రగ్రహమైతే అతను వ్యాపారవేత్తగా జీవించగలుగును. అతనికున్న కర్మప్రకారము, గ్రహముల మిత్ర శత్రు కారణమునుబట్టి వ్యాపారవృత్తిలో గొప్ప పేరు సంపాదించు కోవడము జరుగుచున్నది. బుధ గ్రహము యొక్క అనుకూలమునుబట్టి ఎవరికైనా జ్యోతిష్యశాస్త్రము పూర్తిగా తెలియగలదు. అటువంటి వాడు జ్యోతిష్యునిగా మారిపోవచ్చును.

గురువు

పన్నెండు గ్రహములలో గురువు ఒక పక్షమునకు నాయకుడుగా యున్నాడు. అటువంటి గురువు ఆధీనములో క్రింద చెప్పినవన్నీ గలవు. భూమిమీదున్న ప్రపంచ ధనమూ, వేదవిద్య, ప్రపంచ విద్య, పుత్రులు, జ్యోతిష్యము, గురువుగా ఉండుట, సత్కర్మ చేయుట, శబ్దశాస్త్రము, బ్రాహ్మణత్వము, యజ్ఞాది క్రతువులు, బంగారు, గృహము, అశ్వము, గజము, ఆచారము, సుజనత్వము, శాంతము, మంత్రిత్వము, ఐశ్వర్యము, బంధువృద్ధి, సత్యము, పురాణములు, పౌరాణికము, పుత్రపౌత్ర వృద్ధి, మంచి సంతతి. పూజనీయత, అధికార గౌరవములు, గ్రామాధికారము, పసుపు రంగు, మాట చమత్కారము, మేథావి, తీర్థయాత్ర దేవతా దర్శనములు, గ్రంథ పఠనము, అగ్రస్థానము, తియ్యని ఆహారము, సంస్కృతి, పాండిత్యములో ప్రతిభ, బంధుబలము, సంస్కృతభాష, గ్రంథరచన, ముక్తి సాధన, పౌరోహిత్యము, యుజుర్వేదము, సమయస్ఫూర్తి, మతసిద్ధాంతము, దేవాలయ నిర్మాణము, చవుటి భూములు, కళ్యాణ మందిరములు, భజన మందిరములు