పుట:Jyothishya shastramu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుజగ్రహము చురుకైనది, కోపముగలది. కావున స్థానములనుబట్టి కర్మ ఫలితములు తీక్షణముగా ఉండును.

బుధుడు

జ్యోతిష్యము, గణితశాస్త్రము, మంత్రములు, యంత్రములు, వ్యాపారము, తల్లివైపు బంధువులు, మామగారు, యుక్తి, శిల్పవిద్య, మంత్ర తంత్రవిద్యలు, వేద విచారణ, హాస్యము, వైద్యము, జ్ఞానము, లిపి, పైత్యము, దృష్ఠిబలము, ఆకుపచ్చరంగు, శిల్పకళ చిత్రలేఖనము, శివభక్తి, దాస దాసీ జన అభివృద్ధి, సంధిచేయుట, చాకచక్యముగా మాట్లాడుట, పొట్టితనము, విచిత్ర రచనలు, యుక్తియుక్త జ్ఞానము, చమత్కారము, సైంటిస్టు, ఉత్తరము దిక్కు, బుధవారము, స్మశానభూములు, గోరీలు, దిబ్బలు, దింపుడు కల్లములు, దయ్యాల ఇండ్లు, బలి ఇచ్చుస్థానములు, దయ్యాలు, పాడుపడిన స్థలములు, వ్యాపార స్థలములు, అంగళ్ళు, శూన్యములు, సూక్ష్మములు, భూతవైద్యము, ఉత్తరేణి చెట్టు, పెసలు ధాన్యము మొదలగునవి బుధ గ్రహముయొక్క ఆధీనములో గలవు.

జాతకునికి బుధగ్రహము శత్రుస్థానములోయుంటే బుధుడు ఆరవ స్థానమును తాకినా లేక అందులోయున్నా వానికి దయ్యముల బాధలు తప్పవని చెప్పవచ్చును. దయ్యములు శరీరములో రోగరూపముగాయుంటూ బాధించునని చెప్పవచ్చును. కర్మ బలీయముగావుంటే దయ్యముల చేతనే చంపబడునని చెప్పవచ్చును. బుధగ్రహము అనుకూలముగా (మిత్రునిగా) యుంటే దయ్యముల బాధవుండదు. బుధుడు మిత్రగ్రహమై ఆరవ స్థానములో తాకినా, ఉండినా అతను వైద్యము వలన జీవించుననీ, అందులో భూతవైద్యమును కూడా తెలిసియుండుననీ చెప్పవచ్చును. ఒకవేళ అతనికి