పుట:Jyothishya shastramu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై విధముగా అన్ని గ్రహములకు రాహువు కేతువు ఎదురుగా ప్రయాణించుచూ అన్నిటినీ ఎదురుగా చూస్తూ పోతున్నవి. మిగతా పది గ్రహములు ఒకరి ముఖమును ఒకరు ఎదురుగా చూచుకొనుటకు అవకాశము లేదు. అన్నియూ ఒకే వైపుకు ప్రయాణించుచున్నవి. కావున ఒకదానికి మరొక దాని వీపు కనిపించునుగానీ, ముఖము కనిపించదు. అంతేకాక గురువు వర్గములో రాహువు, శనివర్గములో కేతువు ఉండుట వలన గురువర్గములోని రాహువుతో సహా దశల సంవత్సరములు మొత్తము 63 వస్తున్నవి. అలాగే శనివర్గములోని కేతువుతో సహా ఆ గుంపులోని గ్రహముల దశా సంవత్సరములు మొత్తము 57 వస్తున్నవి. ఒక మనిషి శరీరములోని కుడి ఎడమ భాగములు రెండూ ఎవరికీ సమానముగా లేకుండా, కొద్దిపాటిగా కుడిప్రక్క ఎక్కువగా ఉండడమూ, ఎడమవైపు కొద్దిపాటిగా తక్కువయుండడమూ అందరికీ తెలుసు. కుడిచేయికీ ఎడమ చేయికీ, కుడికాలుకూ ఎడమ కాలుకూ కొద్దిగ అయినా వ్యత్యాసముండును. శరీరములో ఏ విధముగా కుడి ఎడమలు ఎక్కువ తక్కువగా ఉన్నాయో, అదే విధముగా గ్రహముల కుడి, ఎడమ రెండు గుంపులూ తమ తమ దశల సంవత్సరములలో కొంత తేడాగాయుండుటకు గురువర్గములో రాహువునూ, శని వర్గములో కేతువునూ ఉంచడము జరిగినది.

40. పన్నెండు లగ్నములలోనున్న పన్నెండు గ్రహముల పని ఏమి?

కాలచక్రములోని పది గ్రహములు ఒకవైపు ప్రయాణము చేయు చుండగా, రాహు, కేతువులు రెండు మరొక వైపు ప్రయాణము చేయుచున్న వని తెలుసుకొన్నాము. రెండు ఒకవైపుకు, పది మరొక వైపుకు ప్రయాణము