పుట:Jyothishya shastramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయాణించుచుండగా, రాహువు మరియు కేతువు ఇరువురూ కుడినుండి ఎడమకు ప్రయాణించుచున్నారు. పది గ్రహములు కాలచక్రములో ఎడమ నుండి కుడికి సవ్యముగా ప్రయాణించుచుండగా రాహువు, కేతువు ఇద్దరూ కుడినుండి ఎడమకు అపసవ్యముగా ప్రయాణించుచున్నారు. బస్సు రూట్‌లో ఒకవైపుకు ప్రయాణించు బస్సులను తనిఖీ చేయుటకు చెకింగ్‌ ఇన్స్‌పెక్టర్లు బస్సులకు ఎదురుగా ప్రయాణించుచూ తమకు ఎదురవుతున్న బస్సులను ఆపి చెక్‌ చేసినట్లు, పది గ్రహములకు ఎదురుగా ఇన్స్‌పెక్టర్ల మాదిరి రాహువు, కేతువులు ప్రయాణించుచున్నారు. అలా రాహు కేతువులు ప్రయాణించడము వలన గ్రహములన్నీ జాగ్రత్తగా, ఉత్తేజముగా పని చేయుచున్నవి. కాలచక్రములో పది గ్రహములు ఎడమనుండి కుడి వైపుకూ, రాహువు, కేతువు కుడినుండి ఎడమకు ప్రయాణించడము క్రింది 50వ చిత్రపటములో చూడవచ్చును.

50వ చిత్రపటము