పుట:Jyothishya shastramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ వరుస క్రమములోనే జాతకుని దశల కాలము అమలుకు వచ్చునని తెలుసుకోవాలి. ముందు తొమ్మిది గ్రహముల జ్యోతిష్యమునకు, ఇప్పుడు పన్నెండు గ్రహముల జ్యోతిష్యమునకు కొంత తేడాయుండడమును గమనించవచ్చును. ముందు వ్రాసుకొన్న దశలలో గురుదశ అయిపోతూనే శనిదశ మొదలగుచున్నది. అయితే ఇక్కడ క్రొత్త విధానములో గురుదశ అయిపోతూనే భూమిదశ ప్రారంభమగుచున్నదని తెలుసుకోవాలి. పన్నెండు గ్రహములను అనుసరించి వ్రాయు క్రొత్త జాతకములో ప్రస్తుతము మేము పైన వ్రాసిన దశలను వాటి సంవత్సరములను ఉపయోగించి వ్రాసుకో వలసినదిగా తెల్పుచున్నాము.

సూర్యుడు, చంద్రుడు మొదలగు గురుపక్షములోని గ్రహములలో శనిపక్ష రాహువు కలిసియుండడమే సరిjైున పద్ధతిగా దేవుడు పెట్టాడు. అలాగే శని, బుధుడు మొదలగు శనిపక్ష గ్రహములున్న శని పక్షమున కేతువు ఉండడమే సరియైన పద్ధతియని దేవుడే ఆ విధముగా ఉంచాడు. రాహువు శనిపక్షమువాడైయుండి దశలలో మాత్రము గురుపక్షములో ఉండుట మంచిదని ఎందుకు చెప్పుచున్నామనగా! పన్నెండు గ్రహములు రెండు గుంపులుగాయున్నా ఆ గుంపు నాయకులు ఒకవైపు గురువూ మరొక వైపు శని ఉండగా, శని గుంపులోని రాహువు, గురుపక్షములోని కేతువు ఇద్దరూ నాయకత్వ లక్షణములు కల్గియున్నారు. అంతేకాక రెండు గుంపులలో ఎవరు తమ పనిని సక్రమముగా నిర్వర్తించకున్నా, అలసత్వమును గానీ, ఆలస్యమునుగానీ ప్రదర్శించినా రెండు వైపుల వారిని దండిరచు నాయకత్వముకలవారుగాయున్నారు. అంతేకాక పన్నెండు గ్రహములలో పది గ్రహములు అనగా రాహు మరియు కేతువు మినహా అందరూ కాలచక్రములో మన చూపుకు ఎడమనుండి కుడివైపుకు