పుట:Jyothishya shastramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేక అంతకంటే ఎక్కువగా ఖండాంతరములలోయున్నా, ఇంకా ఎక్కువగా గ్రహాంతరములలోయున్నా ఒక్క సెకను కాలము కూడా పూర్తిగా పట్టదనీ, మరణించిన వెంటనే ఎక్కడైనా జన్మించుననీ చెప్పుకొన్నాము. ఏమాత్రము ఆలస్యము లేకుండా చనిపోయిన క్షణములోనే జన్మించినప్పటికీ, అంతకంటే ఎక్కువ వేగముతో సంచిత కర్మ ప్రారబ్ధముగా మార్చి వేయబడును. ఎవరి ఊహకూ అందనంత వేగముగా ఒక జీవితమునకు సరిపడు ప్రారబ్ధకర్మను సంచితము నుండి నిర్ణయించబడును. చనిపోయిన జీవుడు గతజన్మలో కాలచక్రమునుబట్టి కర్మచక్రమునుబట్టి గుణచక్రములో ఎక్కడుండునో, ఏ మార్పు లేకుండ అక్కడేవుండి జన్మించును. కాలచక్ర, కర్మచక్ర, గుణచక్రముల చట్రములో ఏ మార్పు లేకుండ జన్మ కల్గుచున్నది. అంతేకాక పోయిన జన్మలో ఏ దశలోవుండి చనిపోయివుండునో, అదే దశలోనే మరుజన్మ కూడా యుండును. ఒక దశాకాలము పది సంవత్సరము లుండి అందులో మూడు సంవత్సరముల, నాలుగు నెలల, పది రోజులు గడచియుంటే మరుజన్మలో అదే దశ ప్రారంభమగును. పోయిన జన్మలో అయిపోయిన చోటనుండియే ప్రారంభమై గతములో ఆ దశలో జరుగవలసిన ఆరు సంవత్సరముల, ఏడు నెలల ఇరువది రోజులు గడచిన తర్వాత రెండవ దశ ప్రారంభమగును. జన్మలో కర్మ మారినా కాలచక్ర లగ్నములు గానీ, దశా సంవత్సరములుగానీ, గుణచక్రములోని గుణములుగానీ మారవు. ఇంతకుముందు ఏ నక్షత్రములో పుట్టినవారు ఏ దశలో పుట్టునో తెలుసు కొన్నాము. ఇప్పుడు ఏ దశ ఎన్ని సంవత్సరముల పరిమాణమున్నదో తెలుసుకొందాము.

ఒక మనిషి జీవితము యొక్క పరిమాణము 120 సంవత్సరములుగా నిర్ణయించబడినది. 120 సంవత్సరములలో ఒక మనిషి ఎన్నిమార్లు