పుట:Jyothishya shastramu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారంభమగును. అట్లే పన్నెండు లగ్నములకు నక్షత్రములున్నవి కదా! ఆ నక్షత్రములతోనే దశా సంవత్సరములను చూపడము జరుగును క్రింద చూడండి.

ఈ విధముగా నక్షత్రములనుబట్టి దశలను గుర్తించవచ్చును. ఏ నక్షత్రములో జన్మించితే ఏ దశ వచ్చునో తెలియవచ్చును. దీనినిబట్టి రంగయ్య పుట్టిన సమయంలో అనూరాధ నక్షత్రము రెండవ పాదము ఉండుటవలన అతనిది బుధదశయని చెప్పవచ్చును. మనిషి మరణించిన వెంటనే రెండవ జన్మకు పోవునని చెప్పుకొన్నాము. మరణము జరిగిన తర్వాత జన్మకు పోవు లోపల ఎంతకాలము జరుగవచ్చును అని ప్రశ్నవస్తే ఒక్క సెకను కాలము కూడా పూర్తిగా ఉండదనియే చెప్పవచ్చును. మరణము తర్వాత జన్మించవలసిన స్థలము పదివేల కిలోమీటర్ల దూరములోయున్నా,