పుట:Jyothishya shastramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమయములోనున్న లగ్నమును ఆ దిన పంచాంగములో తెలియవచ్చును. పంచాంగములోని లగ్నమును తెలిసినంతమాత్రమున ఆ లగ్నము ఎన్నో పాదము (భాగము) లో జన్మించినదీ కొంత గణితమును ఉపయోగించి తెలియవలెను. అలా తెలియుటకు ముందు దినమున గడచిన నక్షత్రమును తీసుకొని అది ఆ దినము గడచిపోగా, ముందు దినమున గడచిన జన్మదిన నక్షత్రమును తెలిసి, అట్లే పంచాంగము ప్రకారము మనిషి పుట్టిన సమయము వరకు గడచిన నక్షత్రమును తెలిసి ముందు దినము గడచిన మరియు ప్రస్తుత దినము గడచిన నక్షత్రమును కలుపగా మొత్తము గడచిన నక్షత్రము తెలిసిపోవును. అప్పుడు ఆ దినము నక్షత్రము ఎంత వరకున్నదో పంచాంగములో చూచి పంచాంగము ప్రకారము గడచినది తీసివేయగా జరుగవలసినది మిగిలిపోవును. మిగిలిపోయిన దానినిబట్టి గానీ లేక జరిగిన దానినిబట్టిగానీ ఆ దినము జనన సమయమునకు నక్షత్రము ఎన్నో పాదములో ఉన్నదీ తెలిసిపోవును. ఆ దిన నక్షత్రమునుబట్టి పన్నెండు దశలలో ప్రస్తుతము జరుగుచున్న దశ ఏమిటి? అని తెలియవచ్చును. జన్మలో ఉన్న దశను తెలిసిన దాని వెనుకవచ్చు దశలు ఏమిటనీ, అవి ఎన్ని సంవత్సరములు గడియవలసియున్నదనీ తెలియును. ఇప్పుడు ఉదాహరణకు 2009 సంవత్సరము అష్టమి మంగళవారము 17వ తేదీన ఉదయము 9 గంటలకు జన్మించిన రంగయ్య జాతకమునుబట్టి అతను జన్మించిన సమయములోనున్న అనూరాధా నక్షత్ర రెండవ పాదమునుబట్టి అతనికున్న దశలను వాటి సంవత్సరములను తెలుసుకొందాము. కాల చక్రములో మేషము మొదలుకొని మీనము వరకు పన్నెండు భాగములు ఉన్నట్లు, మనిషి దశలలో పన్నెండు గ్రహములు గలవు. మేషలగ్నములో ఎన్ని నక్షత్ర పాదములున్నవో వాటిలో జన్మించిన అదియే సూర్య దశకు