పుట:Jyothishya shastramu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనూరాధ నక్షత్రములో ఏ భాగములో (పాదములో) ఉన్నాడో చెప్పలేదు. చంద్రుడు ఆ దిన నక్షత్రమైన అనూరాధలో ఏ పాదములో ఉన్నాడో తెలియుటకు కొంత గణితమును ఉపయోగించుకొని చివరకు అనూరాధ పాదమును తెలుసుకోగలిగాము. ఆ దినము చంద్రుడు అనూరాధ నక్షత్ర రెండవ పాదములో ఉన్నట్లు తెలిసినది. ఇప్పుడు 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ అష్టమి మంగళవారమున కాలచక్రములోని లగ్నములనూ, అందులోని గ్రహములనూ, గ్రహములున్న పాదములనూ కాలచక్ర లగ్న కుండలిలో అందరికీ తెలియునట్లు వ్రాసి చూచుకొందాము. తర్వాత పేజీలో 49వ చిత్రపటమును చూడుము.

పాఠకులందరికీ సులభముగా జన్మలగ్న కుండలిలో పన్నెండు గ్రహములను లగ్నములలో గుర్తించడమేకాక ఆయా లగ్నములలో ఏ నక్షత్రమందు, ఏ పాదములో ఆ గ్రహములు గలవో సులభముగా అర్థమగుటకు నక్షత్రముల పేర్లను లగ్నములో ఉంచుతూ, వాటితోపాటు నక్షత్రముల నాలుగు పాదములను కూడా చూపి జనన కాలములోని గ్రహములు ఉన్న నక్షత్ర పాదమును కూడా చూపడము జరిగినది. ఈ శ్రమయంతయు పూర్వము జ్యోతిష్యులు పడి జన్మకుండలిని, జన్మ లగ్నమును తెలుసుకొనెడివారు. నేడు ఇటువంటి శ్రమ ఏమాత్రము లేకుండా పుట్టిన తేదీ, పుట్టిన సమయమును చెప్పితే ఆ దినము జన్మ లగ్నము ఏదైనదీ, మిగతా లగ్నములలో గ్రహములు ఎక్కడున్నదీ, దశలు ఏవైనవీ అన్ని వివరములనూ నేడు కంప్యూటర్‌ ద్వారా క్షణాలలో తెలిసిపోవుచున్నవి. పూర్వము ఒక వ్యక్తి యొక్క జాతకలగ్నమును చూచుటకు అతడు పుట్టిన సంవత్సర పంచాంగమునే చూడవలసియుండుట వలన, జ్యోతిష్యులు గడచి పోయిన వందసంవత్సరముల పంచాంగములను కూడా తమవద్ద ఉంచు