పుట:Jyothishya shastramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2009 సం॥ ఫిబ్రవరి 17వ తేదీన ఉదయము 9 గంటలకు జన్మించిన దానివలన ఆ దినమున్న అనూరాధ నక్షత్రములో 9 గంటల సమయమున చంద్రుడు ఏ పాదమందున్నాడో తెలియుటకు అనూరాధకంటే ముందు గడచిపోయిన నక్షత్రమును ఆధారము చేసుకొని చూడవలెను. అట్లు చూచిన అనూరాధకంటే ముందు విశాఖ నక్షత్రము జరిగిపోయినది. విశాఖ జరిగిన తర్వాత 17వ తేదీ మంగళవారము అనూరాధ నక్షత్రము సూర్యోదయమునకు ముందు ఎంత గడచినది తెలిసి ముందు దినము గడచిన అనూరాధ నక్షత్రమునూ, ఆ దినమున్న అనూరాధ నక్షత్రమునూ కలిపి చూచిన నక్షత్ర పరిమాణము తెలిసిపోవును. అప్పుడు నిన్నటి దినము గడచిన అనూరాధను నేడు సూర్యోదయము తర్వాత గడచిన అనూరాధను కలిపిన మొత్తము గడచిన అనూరాధ వచ్చును. నక్షత్ర పరిమాణ కాలమును నాలుగు భాగములుగా విభజించి, ఉదయము 9 గంటల సమయములో నాలుగు భాగములలో ఏ భాగము జరుగుచున్నదో దానినే అప్పటి చంద్రగ్రహ నక్షత్ర పాదముగా లెక్కించవలెను. ఇప్పుడు చెప్పినదంతా అర్థమగుటకు గణితరూపములో చూద్దాము. ముందు దినము 16వ తేదీ విశాఖ 46-25 గడియలకు రాత్రి 1-06 నిమిషములకు అయిపోయినది. అప్పటినుండి అనూరాధ గడుస్తున్నట్లు తెలియవలెను. విశాఖ గంటల ప్రకారమైతే రాత్రి 1-06 నిమిషముల వరకు గలదు. గడియలలో అయితే గడియలు 46-25 విగడియల వరకు కలదు. 17వ తేదీ అనూరాధ 53-04 గడియలు రాత్రి 3-45 వరకు గలదు.