పుట:Jyothishya shastramu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యక్తి జన్మించిన కాలమునుబట్టి ఆ దినము కాల, కర్మచక్రముల గమనములనుబట్టి సూర్యుడు ఏ లగ్నములో ఉన్నాడో దానిని గుర్తించు కోవడము జన్మలగ్నమును గుర్తించుకోవడమగును. 2009 సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీ ఉదయము 9 గం॥ జన్మించిన రంగయ్య జాతకమును చూచి అందులో అతను మీనలగ్నమునందు జన్మించినట్లు తెలుసుకొన్నాము. మీన లగ్నమును అనుసరించి మిగతా అన్ని లగ్నములలో పన్నెండు గ్రహముల స్థితిగతులను గుర్తించుకోవచ్చును. వర్తమాన కాలములో గ్రహములు వాటి గమనమును అనుసరించి ఎక్కడైనా ఉండవచ్చును. పుట్టిన దినమున, జనన సమయములోనున్న పన్నెండు లగ్నములలోగల గ్రహములే జాఫతకమునకు ఆధారమగును. అప్పటి లగ్నమునుబట్టి జీవితములో నిర్ణయించబడిన ప్రారబ్ధకర్మను కొంతవరకు తెలియవచ్చును. అందువలన ప్రతి ఒక్కరు తమతమ జాఫతకములను వ్రాయించి పెట్టుకోవడము మంచిది. 2009 సంవత్సర పంచాంగమునందు 17 తేదీన పన్నెండు గ్రహములు ఏయే లగ్నములలో ఉన్నదీ వ్రాసియుందురు. కావున ఆ పంచాంగమును చూచి పన్నెండు లగ్నములలోని గ్రహములను గుర్తించుకొందాము.