పుట:Jyothishya shastramu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9 గంటల సమయములో మీన లగ్నమున్నది.

2-29 నిమిషములు ఉదయము తర్వాత గడచినది. 17వ తేదీన సూర్యుడు ఉదయించినప్పుడు ధనిష్ట నక్షత్రములో నాల్గవపాదమున ఉన్నాడు. కావున ఆ దినము కుంభ లగ్నముతో ప్రారంభమైనది. ఒక లగ్న ప్రయాణము కర్మచక్రము మీద దాటుటకు దాదాపు రెండు గంటలు పట్టును. అయితే పంచాంగమును బట్టి కుంభలగ్న ప్రమాణము 1.39 నిమిషములు కాగా ఆ దినము కుంభ లగ్న భుక్తి 0-18 నిమిషములు పోగా ఉదయము తర్వాత కుంభలగ్నము 1-21 నిమిషములు మిగిలినది. ఉదయమునుండి గడచిన కాలము 2-29 నిమిషములలో మిగిలిన కుంభ లగ్నముపోగా 1-08 మిగిలినది. కుంభము తర్వాత మీన లగ్న ప్రమాణము 1-37 నిమిషములు. మీనలగ్న ప్రమాణములో 1-08 నిమిషములను తీసివేయగా 0-29 నిమిషములు మీన లగ్నము మిగిలినది. అందువలన అతని జననము మీన లగ్నములో జరిగినదని చెప్పవచ్చును.

రంగయ్య అను వ్యక్తి జన్మించిన కాలమును ఆధారము చేసుకొని, అప్పటి పంచాంగము ద్వారా లెక్కించి, అతని జన్మ లగ్నమును తెలుసుకో గలిగాము. ఇంతవరకు మేము వ్రాస్తూ వచ్చిన జ్యోతిష్య గ్రంథము బాగా అర్థమైనా ఇక్కడ జాతకలగ్నమును లెక్కించి తెలుసుకొన్న చోట కొంత వరకు అర్థము కాకుండ ఉండవచ్చును. ఇంతవరకు పంచాంగ ప్రసక్తి లేకుండా గ్రంథము సాగింది. అందువలన వరుసగా అర్థమైవుంటుంది. అయితే ఇక్కడ పంచాంగ ప్రస్తావన వచ్చిన దానివలన, ఇంతవరకు