పుట:Jyothishya shastramu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శపించాడు. ఆ విధముగ శపించిన ఆత్మజ్ఞాని తన దారిన తను పోయాడు. ఆ శాపమును అక్కడున్న కొందరు విన్నారు. ‘‘వీడు శాపము పెట్టితే నాకు తగిలేదానికి వీడేమైన దేవుడా’’ అని త్రాగినవాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతయు గమనిస్తే ఒకడు హత్యచేసి తప్పు చేశాడు, తర్వాత కొద్ది రోజులకే దారిలో మరొకరిని తగిలాడు, తగిలింది పెద్దతప్పు కాకపోయినా అనుభవించవలసిన శిక్షను అతను శాపము రూపములో పొందాడు. జరుగబోవు శిక్ష ఏమిటో దానిని మిగత కొందరు కూడ విన్నారు. ఇక్కడ తప్పు చేసినవానికి జరుగబోవు శిక్ష ముందే చెప్పబడినది. అలా జరుగబోవు దానిని ముందే చెప్పడము జ్యోతిష్యము అయినది, చెప్పినవాడు ఆత్మజ్ఞాని, తప్పు చేసినవాడు ఎంత తప్పుచేశాడని యోచించకనే, వానిని గూర్చిన పరిశోధన చేయకనే, వాని మీద అధికారము లేకుండనే, ఆత్మజ్ఞాని చెప్పిన దానిని శాపము అంటున్నాము. శాపము రూపములో జరుగబోవు దానిని ముందే చెప్పడము వలన దానిని జ్యోతిష్యము అంటున్నాము. అట్లు జ్ఞానినోట వచ్చిన మాట ప్రకారము లేక జ్యోతిష్యము ప్రకారము మరుజన్మలో వాడు పుట్టు గ్రుడ్డివాడైపోయి జీవితాంతము అంధుడుగానే ఉండెను. ఇట్లు తప్పక జరుగునది శాపము, కావున దానిని శాస్త్రము అంటున్నాము. ఈ విధముగ తప్పుచేసిన వానిని గూర్చి చెడు జరుగునని చెప్పిన శాపమను మాటగానీ, మంచిచేసిన వానిని గూర్చి మంచి జరుగునని చెప్పిన ‘దీవెన’ అను మాటగానీ తప్పక జరుగునవే కావున శాస్త్రమనీ, ముందే చెప్పడము వలన జ్యోతిష్యము అనీ అనడము జరిగినది. అందువలన జ్యోతిష్యము జ్యోతిష్యశాస్త్రమైనది. మొదట ఈ విధముగ మొదలైన జ్యోతిష్య శాస్త్రము కొంత పరిశోధన రూపములో సాగినది. అలా కొందరి చేత పరిశోధన చేయబడి, వారి చేత కనుగొన్న జ్యోతిష్య