పుట:Jyothishya shastramu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకుండా, అక్కడ పడిన కిరణములు కర్మను తీసుకువచ్చి క్రింద చక్రములో నున్న జీవుని మీద వేయునని చెప్పుకొన్నాము. సూర్య కిరణములు గుణ చక్రము మీద పడినప్పుడు, గుణములు పనిచేయడమూ, పడనప్పుడు పని చేయకుండ పోవడము జరుగుచుండును. గుణచక్రములో మూడు గుణభాగములున్నట్లు చెప్పుకొన్నాము. కర్మ కిరణములు గుణముల మీద పడినప్పుడు గుణములు పని చేయడమూ, గుణముల మీద పడనప్పుడు గుణములు పని చేయకుండ పోవడము జరుగుచుండును. గుణములు పనిచేసిన కాలమును పగలు అనియూ, గుణములు పని చేయని కాలమును రాత్రి అనడము జరుగుచున్నది. త్రి అంటే మూడు గుణములనీ, రా అంటే లేకుండడమని అర్థము. వాటినే రాత్రి అనుట వలన మూడు గుణములు పని చేయని సమయమని అర్థము చేసుకోవచ్చును. మూడు గుణములు పని చేయని సమయములో మనస్సుకు పనిలేక అది నిద్రలోనికి జారుకొనును. నిద్ర అంటే ఏ అనుభవమూ లేనిదని చెప్పవచ్చును. ఏ అనుభవమూ లేనిదానిని నిద్ర అనడమేకాక, మూడు గుణములు లేనిది కావున ఆ సమయమును రాత్రి అని అంటున్నాము. రాత్రి సమయములో కూడా కాలచక్రములో గ్రహములు తిరుగుచున్నా కర్మ అనుభవము జీవునికి ఎందుకు లేదని ప్రశ్నరాగలదు. దానికి సమాధానము ఏమనగా! చావుపుట్టుకల విషయమును మనిషి అనుభవ పూర్వకముగా తెలియునట్లు చావుకు గుర్తుగా నిద్రనూ, పుట్టుకకు గుర్తుగా మెలుకువను దేవుడుంచాడు. చావులోనే మూడు గుణములు పని చేయవు కావున, రాత్రి అను పేరును నిద్ర సమయమునకు చెప్పడము జరిగినది. చీకటి వస్తే రాత్రియని, వెలుగువస్తే పగలుయని అనుకోవడము అందరికీ అలవాటైనది. చీకటి వెలుగులు నిజమైన రాత్రి పగళ్ళుకావు.