పుట:Jyothishya shastramu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూడుకొన్నది శాసనమని కూడ చెప్పవచ్చును. పరిశోధనకానీ, అధికారము గానీ లేని శాపము, శాస్త్రము, శాసనముతో సమానమైనదే. అందువలన శాపము, శాసనము, శాస్త్రము మూడు సమానపదములని చెప్పవచ్చును. జ్యోతిష్యము మొదట శాపమునుండి వచ్చినది కావున చివరకు శాస్త్రమైనది.

ఉదాహరణకు ఇటు అధికారముగానీ, అటు పరిశోధనగానీ లేని ఒక ఆత్మజ్ఞాని పాపము గల వానిని అనగా తప్పు చేసిన వానిని శపించాడు. ఆ శాపము తప్పక నెరవేరింది. అలా మొదట ఒక జ్ఞాని చేత ముందే చెప్పబడిన వాక్కు, తర్వాత నెరవేరడమును జ్యోతిష్యము అని కొందరన్నారు. ముందు చెప్పినది జరిగితేనే కదా! దానిని జ్యోతిష్యమనేది. మనకు అర్థమగుటకు మరొక ఉదాహరణను వివరించుకొందాము. ఒకడు ఒక హీనమతిగల స్త్రీని ఊరికి దూరముగానున్న నిర్జన ప్రదేశమునకు తీసుకపోయి బలవంతముగ ఆమె మీద అత్యాచారము చేసి, ఆ విషయము ఎవరికీ తెలియకుండుటకు ఆమెను హత్య చేశాడు. అతడు చేసినది మంచిపని కాదు, చెడుపని. ఆ చెడుపనికి అతనికి పాపము వచ్చియుంటుంది. ఆ పాపమునకు శిక్ష అంటూ ఒకటి ఉంటుంది. ఆ శిక్షను అతడు తప్పక ఎప్పుడో ఒకప్పుడు అనుభవించవలసిందే. కానీ ఆ శిక్ష ఏమిటి? అన్నది మనకు తెలియదు. కానీ అక్కడ జరిగిన విషయమేమంటే ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే, ఆ తప్పుచేసిన వ్యక్తి మత్తు పానీయమును త్రాగి, మత్తు ఎక్కినవాడై దారిలో పోతున్న ఒక ఆత్మజ్ఞానిని ఎదురుగా తగలడమేకాక, అతనినే కళ్ళు కనిపించడము లేదా అని దూషించెను. అట్లు వాడు తగలడమేకాక మత్తులో ఉండి దూషించడమూ, కళ్ళు కనిపించలేదా అనడమూ అన్నీ ఆ ఆత్మజ్ఞానికి కోపమును తెప్పించాయి. అప్పుడు ఆత్మజ్ఞాని ‘‘నీవు జీవితాంతము కళ్ళు కనిపించని గ్రుడ్డివాడవై పోవుదువు గాక’’ అని