పుట:Jyothishya shastramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాస్త్రములు మొత్తము ఆరు గలవు. వాటినే షట్శాస్త్రములని పూర్వమునుండి పెద్దలు చెప్పుచున్నారు. షట్శాస్త్రములలో అతి పెద్దది లేక అతిముఖ్యమైనది ‘బ్రహ్మవిద్యాశాస్త్రము’ బ్రహ్మ అంటే ఎవరో దేవుడనుకోవద్దండి. బ్రహ్మ అనునది పేరేకాదు బ్రహ్మ అంటే పెద్ద అని అర్థము. బ్రహ్మవిద్య అనగా పెద్దవిద్య అని అర్థము. బ్రహ్మవిద్యా శాస్త్రమునే ‘యోగశాస్త్రము’ అనికూడ అంటారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాత రెండవ స్థానములో గల శాస్త్రము జ్యోతిష్యశాస్త్రము. వీటి తర్వాత మిగత నాలుగు శాస్త్రములు కలవు. ఆరుశాస్త్రములలో రెండవ స్థానములోనున్నది జ్యోతిష్యశాస్త్రము, కావున జ్యోతిష్యమును శాస్త్రమే అంటున్నాము. ఇక్కడ కొందరికి శాస్త్రము అంటే ఏమిటి? అను ప్రశ్నరావచ్చును. దానికి జవాబు ఏమనగా!

శాసనములతో కూడుకొన్నది శాస్త్రము అని చెప్పవచ్చును. శాసనము అనగా తూచ తప్పకుండ నెరవేర్చబడునదని అర్థము. చెప్పినది లేక వ్రాసినది ఏదైనా తప్పక జరుగు సత్యమైనపుడు, దానిని ‘శాసనము’ అంటాము మరియు శాస్త్రము అని కూడ అంటాము. చెప్పిన దానిని శాసనము అనీ, వ్రాసిన దానిని శాస్త్రము అనీ అనుట జరుగుచున్నది. వ్రాసినది శాస్త్రము కావాలంటే, వ్రాయకముందే తాను పరిశోధన చేసిన పరిశోధకుడై కనుగొనినదై ఉండాలి. అలాగే చెప్పినది శాసనము కావాలంటే, చెప్పకముందే తాను అధికారముకల్గినవాడై నెరవేరునట్లు చెప్పినదై ఉండాలి. కానీ ఇక్కడ గమనించదగిన విషయమొకటున్నది. ఇటు పరిశోధన లేకుండా, అటు అధికారము లేకుండ చెప్పినది జరుగు విధానము ఒకటి కలదు. దానినే ‘శాపము’ అంటున్నాము. శాస్త్రము, శాసనము రెండూ వేరు వేరుగా ఉండినా, శాసనముతో కూడుకొన్నది శాస్త్రమని చెప్పినట్లే, శాస్త్రముతో