పుట:Jnana Prasadini Volume 01, 1915.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

పలనుదిని కాలముగడపు నాటవికులుగను, రెండవతరగతివారు తమగృహమును గృహోపకరణములను సయిత మొక గాడిదపైనే దరలించుకొని దినమున కొకయూరుగ బ్రయాణము సేయుచు గాయకష్టమన నేమియో యెరుంగక జోరవృత్తి చేతనే పొట్టబోసికొను మూర్ఖులుగనున్నారు. ఇట్టి వీరందరును గలసి ప్రస్తుతము మనదేశపు జనసంఖ్యలో సుమా రైదవభాగముందురని జనాభావలన దెలియుచున్నది.

ఇట్లే పై జెప్పబడిన వివిధ జాతుల వారిలో మాలమాదిగలును గొంద రెరుకయేనాదులును మాత్ర మిప్పుడొక నియిమిత ప్రదేశము నిల్లువాకిలిగలిగి నివసించుటకలదు. అంత్యజుల యభివృద్ధికై పాటుబడనెంచు ప్రతిహైందవుడును ముందు వీరల విషయమైయే యాలోచింపవలెను. ఇంటగెలిచినగదా రచ్చగెలుచుట. ఎరుక యేనాదుల నగ్రవర్ణములవారిండ్ల లోనికి గాకున్నను శూద్రులనువలె దమయావరణములలోనికినైన రానిచ్చెదరు. కాని మాలమాదిగలకుమాత్రము పదిపదునైదుగజముల దూరముననే తొలగిపోవుటయేగాక నిష్కారణముగ వారిని జెప్పరానివారనియు జండాలురనియు బేర్లుపెట్టి పిలిచెదరు. చేతితో తాకుటకుమాత్రమేగాక, మీదుమిక్కిలి సమీపముగ బోవుటకయినను గొరగాని యీహీనకులజులకు విద్య లభించుటయెట్లు? స్సంగత్యమటుండ సజ్జనపరిచయము స యితము లేని పంచములకును నెరుకుయేనాదులకును సద్వృత్తులయం దభిలాషయు, నసత్యమునందు ద్వేషభావమును జనించు విధమెయ్యది? కావున వారిలో సామాన్యముగ నూటి కేబదిమంది దొంగతనమునే జీవనాధారముగా జేసికొనెద