పుట:Jnana Prasadini Volume 01, 1915.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

జానప్రసాదినీ ప్రచురములు:-OF, 15 వ ఏప్రిల్ : 1916.

గీ॥ “ఉద్దరించెద దేశమేనొక్కరుడ నె । నిశ్చయంబిది సేయంగ నేరడొరుడు” అనుచు “విలియము పి”ట్టనునతడుపలికె । అట్లె యెల్లరుదలపగ నగునుశుభము॥

అమితత్వము.


మితిమేరలు లేని దెద్దియును బాగుపడనేరదు. ఆహారము ప్రాణుల కత్యవసరమనియు నది లేకున్న లోకయాత్ర గడువద నియు నంద రెరుగుదురు. వేళకు భోజనము దొరకనియెడల శోష జెంది 'యేపనిని ఒనర్పజాలకుందుము. అందుచే ప్రతివా డును వేళకింత భుజించి ప్రాణమును నిలువ బెట్టుకొన జూచును. ఇట్లు మనుజుల కేగాక మృగములకును పక్షులకునుగూడ ఆ హారము దొరకుటత్వవసరము. కాని వానికిని మనుజులకును ఆహారము దినుటలో విశేషము భేదము కలదు. ఎంత ఆహార ము దొరకినను, ఇతరజంతువులు వానికి కావలసినంతమట్టున కే తినును. మనుజులన్ననో, ఎచ్చటనో ఒక రిరువురు దప్ప త క్కినవారందరును రుచ్యములగు భోజ్యములు దొరకినచో నే మాత్రమును నెనుదీయక పొట్టపట్టినకొలదిని దినుచుందురు. అందువలన నే ఇతర జంతువుల కెన్నడును కలుగని అజీర్ల వ్యా ధి వీరినిబట్టి వేధించుచుండును. మానవులను బాధించు పలు రోగముల కీ అజీణ వ్యాధియే మొదటి కారణమని వైద్యశా స్త్రజ్ఞు లభిప్రాయపడుదురు. అన్న రసము నెత్తి కెక్కుటచే వ్యాధి ప్రాణాపాయకర మైనదని అనుకొనుచుండుట మన మ 'నేక సాగులు విని యున్నాము.