ములు ఎండకును వానకును లెక్క జేయక నేలబడియుండి కొంత కాలమునకు మొకరించి తీవ్రమైన శక్తిగలవై వ్యాధిని తిరిగి వ్యాప్తిజెందించును.
సూక్ష్మజీవుల ఆహారము
సూక్ష్మజీవు లనేకములు వృక్షజాతిలోనివి. ఇందు క్రింద వివరింపబోవు హరితకము లనబడు ఆకుపచ్చ రంగుగల నలుసులుండుటచే, నివి ఆకుపచ్చగ నుండును. కాని కొన్ని జంతుజాతివియు గలవు. ఇందు హరితకము లుండవు. కాన నివి స్వచ్ఛముగ నుండును. మరికొన్ని జంతువు లనికాని వృక్షము లనికాని నిశ్చయముగా చెప్పుట కవకాశ మియ్యక, కొన్ని విషయములలో జంతువులను, ఇతరవిషయములలో వృక్షములను బోలి యీ రెండింటికి మధ్యమావస్థను దెలుపుచుండునని చెప్పవచ్చును.
హరితకములు.
ఆకులు, లేగొమ్మలు మొదలగు నాకుపచ్చగ నుండు భాగములయం దెల్లను పసిరికవర్ణము గలపదార్థ మొకటి గలదు. ఈ పదార్థమునకును మూలపదార్థమునకును గల భేద మీక్రింది శోధనవలన తెలియగలదు. పసిరికరంగు గల జీవిని మద్యసారము (Alcohol) లో వేసినయెడల దాని మూలపదార్థము పేరుకొని కరుడు గట్టును. పసికరంగు మద్యసారములో కరగి మద్యసారమునకు ఆకుపచ్చరంగు నిచ్చును. ఈ పసిరికరంగు చూపునకు క్షణమునం దంతటను వ్యాపించిన ట్లున్నను సూక్ష్మదర్శనితో పరీక్షించునెడల మూలపదార్థములో చెల్లాచెదరుగా నీ రంగు గల