Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈవరకు చెప్పిన కారణములచేత వికారిణియొక్క పాదమును, సూక్ష్మజీవుల మృదురోమమును ముఖ్యాంశములయం దొక్కటే యనియు, రెండును మూలపదార్థనము దాయపుభాగములే యనియు తెలియనగును.

శ్రమవిభాగము (Division Of Labour)

వికారిణియొక్క చలనము దాని మూలపదార్థమునందలి యే భాగముయొక్క సహాయమువలన నైనను గలుగవచ్చును. వికారిణియొక్క నిర్మాణము దానియొక్క దేహమునం దేభాగమునందు జూచినను ఒక్క టేరీతిగ నుండును. అనగా ఒక్క చోట కొంతభాగము నోరు అనిగాని, కొంతభాగము కాళ్లు అనిగాని, కొంతభాగము చేతు లనిగాని ఏర్పాటు లేదు. తనకు కావలసిన యేకార్యము నైనను వికారిణి చేయ దలైనయెడల, దానిమూల పదార్థమునందలి ప్రతిభాగమును ఆకార్యము నెరవేర్చుటకు సిద్ధముగా నుండును. అనగా నది తినుటకు ఎక్కడతలచిన అక్కడే నోరు గలద; ఏవైపునకు నడువ తలచిన నావైపున నే పాదములేర్పడును. సూక్ష్మజీవియొక్క నిర్మాణమునం దట్లు గాక, దాని రెండుకొనలను రెండు మృదురోమము లనుతోక లేర్పడియున్నవి. వీని సహాయము లేక దానికి నడక జరుగ నేరదు. వికారిణివలె నది తన శరీరమునందలి ప్రతిభాగమును తన నడకనిమిత్తము ఉపయోగించుకొననేరదు. ఈ అంశమును మన మనుదినము చూచు జనసంఘములయందలి నిదర్శనములవలన చక్కగ గ్రహింప గలము.