మృదురోమము
లను జరుపుకొనుచుండును. సూక్ష్మజీవుల మృదురోమము లూడిపోయినగాని, లేక వానిని మనము తెగగొట్టినగాని సూక్ష్మజీవులు తత్క్షణము నిశ్చలనము నొందును.
4. వికారిణి తన పాదమును ముందునకుగాని, వెనుకకుగాని, ప్రక్కలకుగాని తన కోరికప్రకారము కదల్చుకొనగలదు. మృదురోమమో, ఏదో యొక నిర్ణయమైనరీతిని ముందువెనుకలకు మాత్రము ఊగుచుండును. ప్రక్కపటములో "మొదలు" అనునది మృదురోమముయొక్క మొదటిభాగము.
"కొ" అనునది దానికొన. అది మృదురోమము. కదలక నిలుకడగా నుండునప్పటి యాకారమును సూచించును. మృదురోమ మెడమప్రక్కకు వంగినప్పుడు దానిమూలపదార్థములో నెడమవైపున లోటుపడి కుడివైపున నుబుకును (ఎ. చూడుము). తిరిగి మృదురోమము కుడివైపునకు వంగినప్పు డావైపున సొట్టపడి ఎడమవైపున నుబుకును (కు. చూడుము). ఇట్లది ముందునకును వెనుకకును కొట్టుకొనుచు, తెడ్లు వేయుటవలన పడవ ఏప్రకారము కదలునో అదేప్రకార మీ మృదురోమములు తెడ్లవలె ఆడుచు సూక్ష్మజీవులను అతివేగమున బోవునట్లు చేయును.
5. వికారిణియొక్క పాదము అప్పుడప్పుడుమాత్రము గదలుచుండును. మృదురోమ మెల్లప్పుడును విరామము లేక యాడుచుండును.