పుట:Jeevasastra Samgrahamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. సూక్ష్మగుటిక (Micrococcus-మైక్రొకాకసు).

ఇది మిక్కిలిచిన్నది. ఇది సూక్ష్మమైన గుండ్రని చుక్కవలె నుండును (సూ. దం). వీనిసమూహము సూక్ష్మదర్శనిలో చూచునప్పుడు మిక్కిలి చిన్నదగు నల్లపూసలు విరజిమ్మినట్లుండును. ఇందు కొన్నిజాతులలో నీ సూక్ష్మగుటికలు రెండు రెండు చొప్పున జంటలుగా జేరియుండును (సూ. గు. లో పై భాగమున జూడుము). మరికొన్నిజాతులలో పూసల సరములవలె నవి యొకదానిప్రక్క నొకటి క్రోవలుగా నేర్పడియుండును (సూ. గు. లో నెడమప్రక్కను జూడుము). ఈసూక్ష్మగుటికలే మన శరీరమునందు జేరి కురుపులు, గాయములు మొదలగు వానియందు చీము పుట్టించునవి. పై పైని వ్యాపించుపుండ్లలోనివి గుత్తులు గుత్తులుగను (Staphylococci) లోతుగ దొలుచుకొనిపోవు స్వభావము గల రణములలో నివి క్రొవలుగను (Streptococci) ఉండును. సెగవ్యాధినిపుట్టించు సూక్ష్మజీవు లీజాతిలోనివే. ఇవి జంటులు జంటులుగ నుండును. (7-వ పటములో "సె" చూడుము).

3. సూక్ష్మదండిక (Bacillus-సిల్లను).

ఇవి కొన్ని దినములవరకు మురిగినకషాయములో గన్పట్టును. సూక్ష్మదండికలు వృద్ధిబొందినకొలది సూక్ష్మతర్కువులు తగ్గిపోవును. కొంత కాలమునకు సూక్ష్మతర్కువులు నశించి సూక్ష్మదండికలు మాత్రము వృద్ధిబొందుచుండును. ఈ సూక్ష్మదండికలు సూక్ష్మతర్కువులకంటె మూడురెట్లు పెద్దవి. ఇవి చిన్న చిన్న