పుట:Jeevasastra Samgrahamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క పరిమాణము అంగుళములో 2,500 వంతు ఉండును. ఇవి జలముకంటె కొంచెము చిక్కగ నుండు రసియను నొకానొక ద్రవపదార్థములో క్రిక్కిరిసిన ట్లుండును. ఇవి యొక చుక్క (Minim) నెత్తురులో 30 కోట్లు ఉండునని లెక్కింపబడినది. ఈ కణములలో రెండుజాతులు గలవు. అం దొకజాతివి ఎర్రగను, గుండ్రముగను ఉండును. ఇవి దొంతులుగా పేర్చబడిన బేడకాసులవలె నొక దాని

నొకటి చేరుకొనియుండి రక్తములో మహావేగమున కొట్టుకొని పోవుచుండును. (క్రిందిపటములో ఎ. అనుచో చూచిన వానిరూపము తేటపడగలదు). నెత్తురుయొక్క యెర్రదనమంతయు వీనివలననే గలుగును.ఇవి కాక జాగ్రత్తగా పరీక్షించి చూచునెడల నెర్రకణముల (Red Corpuscles) మధ్య మధ్య ఇంచుమించుగా అయిదేసి వందల కొక్కటి చొప్పున వానికంటె పెద్దవిగానుండు తెల్లకణములు (White Corpuscles) కానబడును. (పటములో తె. చూడుము).

తెల్లకణములు

ఇవి మిక్కిలి విచిత్రములైనవి; వీనిని చూచుతోడనే వికారిణి జ్ఞప్తికివచ్చును. ఇవియు స్వచ్ఛమును వర్ణరహితము నైనమూల