పుట:Jeevasastra Samgrahamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములవరకు దానికి చురుకుదన మధిక మగును. తరువాత ఆ చురుకుదనము పోయి మాంద్యముగలుగును. 30°C-35°C భాగములవరకు వేడిఎక్కించువరకు వికారిణి నిశ్చలము నొందును. కాని తిరిగి యానీళ్లను చల్లార్చినయెడల దానికి చలనము గలుగును. వేడి 40°C భాగములవరకు హెచ్చించినప్పుడు వికారిణి యొక్క మూలపదార్థము గట్టిపడుటచే నది మరణము నొందును. దీనికే తాపకాఠిన్యము (Heat rigor) అని పేరు. అది నివసించు 15°C-20°C భాగములయందుండు నీటిని క్రమముగా చల్లార్చినయెడల దాని చలనము మొదలగునవి క్రమముగ తగ్గుచు 0°C మెట్టువరకు దిగునప్పటి కది నిశ్చలనము నొందును. అయినను చలిచే గలుగు నిశ్చలనము తత్కాలమునకు గలుగునదే కాని స్థిరమైనది గాదు. ఏలయనగా నట్టి నీటిని క్రమముగా కాచినప్పు డీ నిశ్చలనము నొందిన వికారిణి తిరిగి చురుకుదనముగల దగును.

మన రక్తమునందలి కణములు (Blood Coruscles)

మనశరీరమునందు సహితము వికారిణిని బోలియుండుజీవులు కోటానుకోట్లు గలవని వ్రాసినచో చదువరులకు చిత్రముగ దోచవచ్చును.

మన రక్తమునం దొక బిందువును సూక్ష్మదర్శనిలో పరీక్షించినపక్షమున కణములని చెప్పబడెడు అణురూపములైన గుండ్రని ఘనపదార్థము లపారముగా గానబడును. ఒక్కొకకణము