Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ కూర్పునకు

పీఠిక.

విజ్ఞానచంద్రికా మండలి వారి ప్రోత్సాహమువలన మొదటికూర్పు వేయిప్రతులును సంవత్సరములోపలనే అమ్మకమైనందునను, ప్రస్తుతము రమారమి 300 దరఖాస్తు లీ పుస్తకముకొరకై వచ్చియున్నందునను, ఇంతత్వరలో రెండవకూర్పు అచ్చొత్తింపవలసివచ్చినది. నాకు ఈసంవత్సరముగూడ బొత్తుగ సావకాశము లేకపోవుటచేత నేను చేయదలచుకొనినమార్పులను నాకుసంతృప్తియగునట్లుగా చేయలేకపోయినను నాకుగల విశ్రమకాలమునంతయును వినియోగించి రమారమి 30 పటములను క్రొత్తగచేర్చి చదువరులకు మరింతసులభముగ బోధయగునట్లు జేసితిని. చివరభాగమున నొక ప్రకరణమునుగూడ క్రొత్తగ జేర్చితిని. వృక్షశాస్త్రమును మాత్రము చదువుకొన గోరువారి కనుకూలముగ నుండునట్లు గ్రంథమును రెండుభాగములుగ విడదీసి విషయమును తదనుకూలముగ కొంతవరకు మార్పుచేసితిని.

స్కూల్ బుక్ అండ్ లిటరేచరు సొసైటీ అను సంఘమువారు ఈ గ్రంథముయొక్క మొదటికూర్పునకు రు 100 లు బహుమానమిచ్చి ప్రోత్సాహపరచినందులకు వారియెడల నాకృతజ్ఞతను చూపుచున్నాను.

ఈకూర్పులో క్రొత్తగ చేర్చబడిన పటములుకొన్ని మహారాజశ్రీ రంగాచార్యులు, ఎం. ఏ., యల్. టి., గారు అరవభాషలో వ్రాసిన వృక్షశాస్త్రముననుసరించి వ్రాయబడినవి. అందులకు వారు మిక్కిలి దయతోనంగీకరించిరి. ఈవిషయమై వారికి మనఃపూర్వకముగా కృతజ్ఞతా వందనము లాచరించుచున్నాను.