Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలపదార్థ మీ క్రింది పదార్థముల సమ్మిశ్రణముచే నైనదని రసవాదశాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఇది మాంసకృత్తు (Proteid) అను పదార్థముచే నయినది. ఈ మాంసకృత్తును విభజించిచూడ దానియందు 1.బొగ్గు (కర్బనము-Carbon). 2.ప్రాణవాయువు (ఆమ్లజనము-Oxygen). 3.జలవాయువు (ఉజ్జనము-Hydrogen). 4.నత్రజనము (Nitrogen). 5.గంధకము (Sulphur). 6.స్పురము (Phosphorus). 7.సున్నము (Lime) మొదలగు పదార్థములు కనబడును. కాని ఈశాస్త్రవేత్తలకు పైని చెప్పబడిన పదార్థసమ్మేళనముచే నిప్పటివరకు మూలపదార్థమును సృజించుటకు సాధ్యము కాకున్నది.

మలమూత్రోత్సర్జనము.

వికారిణియొక్క వ్యాపారములలో నాల్గవది మలమూత్రములను విసర్జించుట. వికారిణికి మలమూత్రద్వారములు లేవుగదా, ఇది ఎట్లు వానిని విసర్జించును? వికారిణికి విసర్జించువస్తువులు మూడువిధములుగ నుండవచ్చును. 1. స్థూలములు (Solids). 2.ద్రవములు (Liquids). 3.వాయువులు (Gases).

1. స్థూలములు - వికారిణికి మ్రింగిన ప్రాణులయొక్క పైగుల్ల. మొదలుగా గల అజీర్ణ పదార్థముల నది ఎట్లు విసర్జించునో చెప్పియుంటిమి. వీనినే మలమని చెప్పవచ్చును.

2. ద్రవములు - వికారిణి తన ఆహారముతోపాటు ఆహారాశయములో కొంత నీటినిగూడ నిముడ్చుకొనునని వ్రాసియుం