డ్చుచువచ్చిన ఆ గుట్ట యెట్లు క్రమక్రమముగా పెద్దది యగునో అట్లే వికారిణియొక్క మూలపదార్థము నందలి అణువులకు మధ్య నుండెడి యెడములయందు క్రొత్తమూలపదార్థపు అణువులు చేరుటవలన వికారిణి పెరుగు చుండును. దీనికి అంతర్వృద్ధి (Intus-susception) అని పేరు.
రెండవవిధమైన పెంపు-అప్పుడప్పుడు గోడకు వేయుచున్న సున్నపుపూతలు పొరలుపొరలుగా నొక దానిపై నొకటి చేరి, గోడ యెట్లు దళస రెక్కుచున్నదో అదేప్రకార మీ రెండవవిధమైన పెంపు సమకూరును. ఇట్టి పెంపు వికారిణికిగూడ నొక్కొక సమయమందు గలదని కొందరి యభిప్రాయము. ఎప్పుడన-వికారిణి యొకానొకప్పుడు నిశ్చలనమునొంది తనచుట్టును గూడుకట్టుకొనునని చెప్పియున్నాము. వికారిణియొక్క మూలపదార్థమునుండి స్రవించెడి పదార్థ మొకటి దానిచుట్టు నొక పలుచనిపొరగా నేర్పడును. మూలపదార్థమునుండి యాపదార్థ మెడతెగక స్రవించుచు అట్టి పొరయొక్క లోతట్టున జేరి పొరలుపొరలుగా నేర్పడుచుండును. ఈప్రకారమే నత్తగుల్లలు ముత్యపు చిప్పలు మొదలగు నీటి జంతువులపైని దళమును రమ్యమునైన గుల్ల లేర్పడుచున్నవి. ఇట్టివృద్ధికి పటలవృద్ధి (Accretion) అని పేరు.
వికారిణి అంగుళములో నూరవవంతుకంటె ఏల పెరుగదు!
వికారిణి ప్రాయికముగా అంగుళములో నూరవవంతుకంటె పెద్దదిగ నుండదని చెప్పియున్నాము. పై పరిచ్ఛేదము