పుట:Jeevasastra Samgrahamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్థము మధ్య కొంతస్థలము నాక్రమించుకొనును. (1-వ పటములో Bలో ఆ.అ.చూడుము). ఆ స్థలమునకు ఆహారావకాశము (Food Vacuole) అని పేరు. ఈ ప్రకార మిముడ్చుకొనబడిన జీవులయొక్క మూలపదార్థము వికారిణియొక్క మూలపదార్థమునుండి స్రవించునట్టి యేదో జీర్ణ రసముయొక్క శక్తిచే క్రమక్రమముగ జీర్ణమై కరగి వికారిణియొక్క మూలపదార్థములో ఏకీభవించును. తుదకా యాహార పదార్థముపై నుండు గుల్లచిప్ప మొదలగు జీర్ణముకాని వస్తువులు తప్ప మిగిలినదంతయు నరిగిపోవును. పిమ్మట వికారిణి నెమ్మదిగ బ్రాకునప్పుడు జీర్ణముకాని యా వట్టిగుల్లను తన వెనుక విడిచిపోవును. ఈప్రకారము సజీవులగు చిన్న జంతువులను ఉన్నవి యున్నట్లుగా మ్రింగి, తనకు కావలసిన పదార్థములను జీర్ణము చేసికొని పనికిరాని అజీర్ణ పదార్థములను విసర్జించును. ఇట్లు చేయుచుండు వికారిణికి మనవలె తినుటకు నోరుగాని, జీర్ణించుకొనుట కుదరముగాని, విసర్జించుట కాసనముగాని లేదుసుమీ!

3. వృద్ధి.

వ్యాపారములలో మూడవది పెరుగుట. వికారిణి మ్రింగిన ఆహార పదార్థము జీర్ణమై మూలపదార్థములో లీనమగునని వ్రాసియున్నాము. అట్లు మూలపదార్థములో నూతనపదార్థములు సదా లీనమగుటచేత వికారిణియొక్క పరిమాణము హెచ్చగుచుండును. ఇదియే పెరుగుట. ఈ పెంపు రెండువిధముల గలుగవచ్చును. అందు మొదటి దెట్లగునన:- ఒక గులక రాతి గుట్టమధ్య నెడ తెగక ఒక్కొక చిన్న రాతి నిము