ర్థపు సముదాయమే. ఇందు జీవస్థానము గలదు. కాన వికారిణి యొకకణము.
వికారిణియొక్క వ్యాపారములు.
ఇంతవరకు వికారిణియొక్క అవయవనిర్మాణము (Structure)ను గూర్చి సంగ్రహముగా జెప్పబడినది. వికారిణియొక్క వ్యాపారములను (Functions) గూర్చి ముందు వివరింపబోవు చున్నాము.
1. చలనము.
వికారిణియొక్క వ్యాపారములలో మొదటిది నడచుట. వికారిణి యెట్లు నడచును? ఇది తన శరీరములోని యొకప్రక్క నొకపాయను పాదముగా పెంచుకొని మరియొక ప్రక్కను అంతభాగమునే అనురూపముగ ముడుచుకొనుటవలన జలగవలె నడవనోపును. అనగా దీనిపాయ లొక్కచో వికసించుచుండిన వేరొకచో సంకోచించుచుండును. కనుక వికారిణికి సంకోచనశక్తి (Contractility) గలదని చెప్పవచ్చును. ఈశక్తి రెండువిధములుగ నుండవచ్చును. మొదటిది వికారిణి యొక్క ఇచ్ఛానుసారము గలుగునది. ఇది స్వేచ్ఛాసంకోచనము (Automatic Movement) అనబడును. ఇట్టి స్వేచ్ఛాసంకోచనము గల దగుటచేతనే వికారిణి తన ఇష్టమువచ్చిన వైపునకు ప్రాకి పోగలదు. రెండవది ప్రేరితసంకోచనము (Irritability)అనబడును. ఇది బాహ్యకారణముల పురికొల్పుటచే కలుగును
వికారిణిని ఒక పుల్లతో తాకిన యెడల ..........