అవకాశ మొకటి చక్రాకారముగ కనబడును.(A. B.లలో నం.అ.చూడుము). అది కొంతకాలమునకు తటాలున ముడుచుకొని అదృశ్యమై తిరిగి క్రమక్రమముగ తెరవబడి ఎప్పటివలె కనిపించును. ఇట్లు సంకోచవికాసముల నొందుటనుబట్టి దీనికి సంకోచనావకాశము (Contractile Vacuole) అనగా ముడుచుకొను స్వభావము గల అవకాశము అనిపేరు. ఇది వికసించునప్పుడు నీటివంటి ద్రవపదార్థముతో నిండియుండును.
సారాంశములు:- వికారిణి తాటిముంజెముక్కను బోలి మిలమిలలాడుచుండు మూలపదార్థములయొక్క చిన్న సముదాయము. ఆమూలపదార్థములో అంతటంతట మారుచుండు పాయలు పాదములుగా నేర్పడుచుండును (1-వ పటములో A, Bలలోపా). ఇవియే యొక చోటనుండి మరియొక చోటికిబోవునప్పుడు వికారిణి ఉపయోగించుకొను పాదములు. వికారిణిలోని చుట్టునుండు భాగము బహి:పలలము. మధ్యనుండుభాగము అంత:పలలము. అంత:పలలములో జీవస్థానమును, బహి:పలలములో సంకోచనావకాశమును గలవు. జీవస్థానముచుట్టును కవచమువంటి పొరయొకటిగలదు. జీవస్థానపు మధ్యమున జీవస్థానగర్భముండును. సంకోచనావకాశములో ద్రవపదార్థమంతటంతట జేరుచుండును.
కణమనగా నేమి?
జీవస్థానము గల మూలపదార్థపు సముదాయమునకు జీవశాస్త్రమునందు కణము (Cell) అని పేరు. వికారిణి మూలపదా