మునకే మూలపదార్థ (Protoplasm) మని పేరు. వికారిణిని నీలిమందు మొదలగురంగులలో వేసితిమా అది చచ్చును. అప్పుడు దానిని సూక్ష్మదర్శినియందు పరీక్షింపగా దాని నిర్మాణమును గూర్చికొన్ని సంగతులను మనము తెలిసికొనవచ్చును. ఏవనగా, మూలపదార్థమున కంతటికిని సమానముగా రంగు పట్టక, అంత:పలలమునందలి అణువుల కెక్కునరంగు పట్టుట చేత నది బహి:పలలమునకంటె నల్లగా కనిపించును. మరియు అంత:పలలమధ్యమున నొకగుండ్రనిభాగము తక్కినచోట్లకంటె నెక్కువరంగుగలదై స్ఫుటముగా కనిపించును. (A.B.లలో జీ.చూడుము). దీనికి జీవస్థాన (Nucleus) మని పేరు. ఇది ప్రాణియొక్క జీవమునకు ముఖ్యాధారమైన భాగము. కాన దీని కీపేరు కలిగెను.
చిన్న వస్తువులను అనేక రెట్లు పెంచి చూపెడి సూక్ష్మదర్శనితో శోధింపగా జీవస్థానములోగూడ అన్ని భాగములకు నేకరీతిని రంగు పట్టునట్లు తెలియగలదు. సామాన్యముగా జీవస్థానముచుట్టు నత్యల్పమైన పొర యొకటి కన్పట్టును. ఇది జీవస్థాన కవచము (Nucleu Membrane) కొన్ని జీవస్థానములందు మిక్కిలి హెచ్చు రంగు గల మధ్యభాగము స్పష్టముగా తెలియు చుండును. (A-లో జీ.గ.చూడుము) దీనికి జీవస్థానగర్భ (Nucleolus) మని పేరు.
సంకోచనావకాశము.
సజీవమగు వికారిణిని సూక్ష్మదర్శనిగుండ పరీక్షించునప్పుడు ---జెప్పిన జీవస్థానము గాక బహి:పలలములో నిర్మల మైన