జ్ఞులు ఒక్క మానవ పిండమునే పరీక్షింపక సమస్త జంతువుల పిండములను పరీక్షించిరి. పిండోత్పత్తి సమయమునుండి శిశువుపుట్టువఱకును వీనియభివృద్ధిజూచిన, అవి పూర్వము ఉత్క్రాంతి మార్గమున నేయేరూపములను ధరించెనో, యాయారూపములను కొంతకాలమువఱకైనను ధరించును అని తెలియుచున్నది. ఏనుగు, పంది, ఆవు, కోతి, మానవుడు మొదలగు నత్యంతభిన్నా కారములు గల జంతువులన్నియు బిండోత్పత్తిసమయమున ఏక కణమయములయి యేకా కారములుగనుండును. పిండోత్పత్తియైన తరువాత గొన్ని దినములవఱకును ఈపిండములన్నియు సమానముగానేవృద్ధి జెందును. ఇందుమానవపిండమునుగుఱించి కొంచెము విచారింతము. మొట్ట మొదట నీ పిండ మేక కణమై యుండును. అప్పుడు వానిని ఏక కణమయములగు వికారిణి వంటి యాదిమ జంతువులతో బోల్చవచ్చును. తరువాత ఈ ఏకకణము రెండు కణములుగాను, అవి నాలుగు, ఎనిమిది, పదియాఱు, ఈ లాగున నభివృద్ధియై యొకటి నొకటిని అంటుకొని ముద్దవలె నుండును. అప్పు డాపిండమును, ప్రవాళ కీటకములతోగాని, బూజు కుక్క గొడుగులతో గాని కొంతవఱకు పోల్చవచ్చును. ఈ ప్రకార మీ పిండ మభివృద్ధియైన కొలదిని హెచ్చుతరగతి జంతువుల స్వరూపములను దాల్చుచు తుదకది మనుష్యాకృతి దాల్చును. ఇటులనే యితర ప్రాణులను గుఱించియు నెఱుగునది.
3. శరీర స్థూలనిర్మాణ శాస్త్రము.
(Anatomy)
ఈశాస్త్ర మిచ్చెడిసాక్ష్యము పరిణామవాదమునకు మిక్కిలి యనుకూలమైనది. హెచ్చుతరగతి జంతువు లన్నిటి యొక్క నిర్మాణమునందును శరీరము నిలువబడి యుండు నిమిత్తమై యాధారముగా అస్థిపంజరము (Skeleton) ఉండును. ఇంటికిని బందిరికిని స్తంభము లెటువంటివో యీయస్థులును శరీరమున కటువంటివి. వేఱువేఱు విధమైన కండరములు (Muscles) ఈ యస్థులను జోడించును. ఇవి యన్నియు జర్మచక్షువులకు గానవచ్చును. వీనిని గుఱించి