Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవి జీర్ణకోశాదియాకారములను దాల్చును. ఇట్లు భిన్న భిన్న కణములలో శ్రమవిభాగము (Division of labour) గలిగి జీవులకు హెచ్చుతరగతిప్రాప్తమగును.

మానవుల సంఘములకును, జీవులకును పోలిక యిదివఱకు మనము కనిపెట్టుచు వచ్చుచున్నాము. ఏమానవ సంఘములో వేఱువేఱు మానవులు వేఱు వేఱు పనులు జేయుచుందురో యది యధిక నాగరీకత జెందిన దని మనము చెప్పవచ్చును. ప్రతి మానవుడును, తన పొలమును తానేదున్నుకొని, తన బట్టలు తానేనేసికొని, తన యిల్లు తానే కట్టుకొను సంఘముకంటె, వ్యవసాయము చేయువారు వేఱుగను, బట్టలు నేయువారు వేఱుగను, ఇండ్లు కట్టువారు వేఱుగను, కుండలు చేయువారు వేఱుగను, కరణము పని చేయువారు వేఱు;గను, ఏర్పడిన గ్రామసంఘము శ్రేష్ఠముగదా ఇటులనే జంతు శరీర రచనను గుఱించి యెఱుగునది. జీవవనవ్యాపారములు చేయుటకు నొక్క యవయవము కల జంతువులకంటె రెండు అవయవములు కల జంతువు శ్రేష్ఠమైనది; అంతకంటె మూడుయవయములు కలది గొప్పది; దానికంటె నాలుగు, అవయవములుకలది యధికమైనది. ఈ లాగుననే యితర హెచ్చు తరగతి జంతువులను గుఱించి యెఱుగవలయును.

పైన వర్ణింప బడినటుల వేఱువేఱు కణములకు వేఱువేఱు పనులేర్పడి క్రమముగ నొకటికంటె శ్రేష్ఠమైన మఱియొకజంతువు పుట్టసాగెను. ఈలాగు జలచరములును, జలస్థల చరములును, కేవల స్థలచారములగు చిన్న జంతువులును, చరుష్పాద్ జంతువులును, మనుష్యులా యేమియనదగు వానరములును, మనుష్యులును, క్రమక్రమముగా నొకదానికంటె నొకటి హెచ్చు తరగతివి యగు జంతువులు భూమిపై బుట్టెను. ఈ ప్రకార మాయుగమున కాయుగమునకు బెద్దపెద్దవియగు జీవు లుదయించుచు సృష్టియందు నుండుట కనర్హమగు, అనేక జంతువులజాతులు పూర్తిగా నశించుచు, గొన్ని జాతులు శరీర రచనయందు నభివృద్ది జెందుచు దుదకు భూమిపై మనుష్యు డుదయించెను. ఈ మానవుండెట్లు ఒక జీవకణములో నుండి బయలుదేరి క్రమముగా ననేక జంతువుల శరీరములను దాల్చి తుద కీరూపమును దాల్చెను.