Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గింజయని వాడెడు క్రిందిభాగము. కాయయొక్క ముఖ్యభాగములన్నియు దానిలోనున్నవి.

కొన్నివృక్షములలో అనేక పూవులు గుత్తులుగాచేరి యొక్కొకగుత్తి దానితో సంబంధించియుండు తొడిమలు మొదలగు వానితో మిశ్రమై యొక్కొక కాయయగుచున్నది; పనస, అనాస, అత్తి, మర్రి, రావి మొదలగుకాయలు. పనస కాయలలో ఒక్కొకతొన ఒక్కొక పువ్వు.

అనాసచెట్టుయొక్క పూవులన్నియు గుత్తులుగాపుట్టి చెట్టుయొక్కకొమ్మయు, పూగుత్తులయొక్క తొడిమలును, పూవులును గూడ గుంజుగామారి యేకమై అనాసకాయ యగుచున్నవి. 101-వ పటముచూడుము. కొన్ని పూవులలో అన్నిభాగములు ఉన్నప్పటికిని గింజలుకానరావు. ఇట్టిపూవులు గొడ్డుపూవులని చెప్పవచ్చును. సంయోగము అయినతరువాత అన్నిపూవులును అంటుకొనిపోయి కొంత గుంజుతోగలసి కాయయగును.

పనసకాయలోగూడ పుష్పములన్నియు గుత్తులు గుత్తులుగా పెరుగును. అయినను మగపూవులన్నియు ఒక గుత్తియగును. ఆడపూవులన్నియు మరియొకగుత్తియగును. మిధునపుష్పములు లేవు. సంయోగము అయినతరువాత ఆడగుత్తిమాత్రము పెరిగి పనసకాయయగును. మగపూవులనుండి పుప్పొడిపుట్టి ఆపుప్పొడియంతయు రాలిపోవును.

ఒక్కొక పనసతొన ఒక్కొకఆడపూవు. మనము తిను తక్కినభాగములు సంరక్షక పత్రములవలనను, ఆకర్షణపత్రములవలనను ఏర్పడినవి. తొనలోపలనుండు గింజగలసంచి అండాశయము. ఈ సంచిలోపల గింజపై నంటియుండు పలుచనిగోధుమరంగు