Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాయయొక్క వెలుపలి తట్టుననుండు నారగలడొక్కలును పెంకుయును గూడ ఫలకవచముయొక్క భాగములు. వీనికి సంబంధించినభాగములు ఈతకాయ ఖర్జూరపు కాయలలో తియ్యగను మెత్తగను ఉండును. పెంకులోపలి భాగము మాత్రమే గింజ. ఈగింజయొక్క పై భాగముననుండు పలుచని గోధుమరంగుగల పొరయే బీజకవచము. ఈపొరలోపలి తెల్లని తియ్యని భాగమును, నీళ్లును బీజపోషకము అనుభాగము. ఈతకాయలోన బీజపోషకము మిక్కిలి గట్టిపడి సాధారణముగా గింజ యనబడుచుండును.

కొబ్బరికాయ మూడు అండాశయముల సంమిశ్రణముచే నేర్పడినది. అందుచే దానియందు-మూడు అరలుగలవు. అందు ఒక్కటి మాత్రము సంయోగమైన తరువాత పెద్దదై వృద్ధిపొం