Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొక్కుకొనిపోవును. ఇట్టి కాయలలో కొన్ని, యెండినప్పుడు వానిగింజల మధ్యనుండు సంధులలోవిరిగి వేరు వేరు కాయలుగా నేర్పడును.

గట్టికాయలు.

మనము వడ్లగింజ అని చెప్పునది నిజమైనకాయ. గింజకాదు చిట్టు అగుభాగము ఫలకవచము. బియ్యపు గింజపై నుండు కొంచె మెర్రరంగుగల పలుచనిపొర బీజకవచము. ఈభాగము తవుడు అగును. ఈపొరయు దీనిలోపలిభాగములును చేరినభాగము నిజమైనవరిగింజ. మనము తినుబియ్యపుగింజ బీజదళము. బీజదళము ఈకాయలో నొక్కటేగలదు. కాన వరియొక్క ఏకబీజదళవృక్షము. వడ్లగింజయం దొకకొన నంటియుండు చిన్న కొక్కెమువలె నుండు భాగమే పిండము.

చింతకాయ, వడ్లగింజవీనివంటి యెండినను పగులని కాయలకు గట్టికాయలు (Indehiscent) అని పేరు. వానిని అవిదారణఫలము లనియు చెప్పవచ్చును.

వెలగ కాయయొక్క వెలుపలిభాగము ఎండి కఠినమైన పెంకుగానయినను అది కండకాయలలో నిదే. కొబ్బరికాయలో ఫలకవచముయొక్క వేరువేరుభాగములు వేరువేరుమూర్పులను జెందియున్నవి. అయినను ఇది నిజమైన కాయయేగాని దొంగకాయకాదని తెలిసికొనవలెను. ఇది మామిడికాయవలెనే యొక టెంకకాయ. పటముచూడుము.