ఈ పుట ఆమోదించబడ్డది
ఈఅరలయొక్క గోడలు ఇప్పుడు పగులకుండుట చేత అరలలోని గింజలు తమ అరలలోపలనే యుండును. ఈ కాయలు పగులునప్పుడు, వాని అరలు గింజలసహితముగా ఎగిరిపోవును. ఈ అరలు తిరిగి కొంతకాలము వరకు ఎండినపిమ్మట పగిలి వానినుండి గింజలు బయలువెడలును.
98-వ పటము.
తుమ్మకాయ, సీమచింతకాయ మొదలగు కొన్ని కాయలలో ఒక గింజకు మరియొక గింజకు మధ్యమున నుండు ఫలకవచము