Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరీక్షించి చూడగా ఫలకవచమునందు మూడుభాగములున్నట్లు తోచుచున్నది.

I. వెలుపలిభాగము, లేక బాహ్యఫలకచము (Epicarp)

II. మధ్యభాగము లేక మధ్యఫలకవచము (Mesocarp)

III. లోపలిభాగము లేక అంతర్ఫలకవచము (Endocarp) ఈమూడు భాగములయొక్క వివరమును చక్కగ గ్రహించు నిమిత్తమై మామిడికాయను నిలువున కోయగా నేర్పడినచెక్కయొక్క

ఆకారమును చూపు 93-వ పటమును చూడుము. 1. అందు వెలుపలి భాగమున నున్న నల్లని గీటువలె కనబడునది (5) బాహ్య ఫలకవచము. ఇదిపచ్చి కాయలో నాకు పచ్చగను, పండుకాయలో సామాన్యముగ పసుపుపచ్చగను ఉండు తొక్క. II.పటములో 4:- ఇది మధ్యభాగమున నుండు గుంజు. ఇది పచ్చికాయలో తెల్లగను గట్టిగను సామాన్యముగ పుల్లగను ఉండును. పండుకాయలో పలుచబడి రసమగును. దీనికి